ప్రొడ్యూసర్ గా కొత్త జ‌ర్ని స్టార్ట్ చేసిన‌ సమంత.. డీటెయిల్స్ ఇవే ..

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా పేరును సంపాదించుకోవడం సాధారణ విషయం కాదు. ఇందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్గా మారిన వారిలో చెన్నై సోయాగం సమంతా ఒకటి. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకొని కోట్లాదిమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. అయితే టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పలు సినిమాల్లో నటించిన సామ్‌ ఇటీవల మయోసైటిస్ భారిన పడి ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను, కొన్ని బ్రాండ్స్ ప్రమోషన్స్ ను చేస్తూ సందడి చేస్తుంది. ఇక తాజాగా ప్రొఫెషనల్ పరంగా మరో అడుగు ముందుకు వేసింది ఈ ముద్దుగుమ్మ. సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన సామ్ ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం కాబోతోంది. త్ర‌లాల‌ మూవింగ్ పిక్చర్స్ పేరుతో హోం ప్రొడక్షన్ హౌసింగ్ స్థాపించిన ఈ బ్యూటీ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.

Samantha Ruth Prabhu announces production house Tra-la-la Moving Pictures, unveils company's logo - watch, samantha-ruth-prabhu-announces-production- house-tra-la-la-moving-pictures-unveils-companys-logo-watch

నా ప్రొడక్షన్ హౌస్ ని ప్రకటించినందుకు సంతోషంగా ఉన్న సంక్లిష్టమైన కథలను విని.. ఎంకరేజ్ చేసి.. సినిమాలు తీసే ప్రొడక్షన్ హౌస్ ఇది అంటూ రాసుకొచ్చింది. సినీ ప్రొడ్యూసర్స్.. ఒక అర్థవంతమైన ప్రామాణికమైన కథను చెప్పడానికి ఇది కొత్త ప్లాట్ఫామ్‌. ఆలోచనలు, భావోద్వేగాలని ప్రతిబింబించే కంటెంట్ ప్రేక్షకులకు అందించడమే నా ప్రొడక్షన్ హౌస్ లక్ష్యం. నాకు ఇష్టమైన పాటల్లో ఒక దాని నుండి ప్రేరణ పొందిన బ్రౌన్ గర్ల్ ఇప్పుడు పోటీలో ఉంది అంటూ సామ్ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం సిటాడెల్ అలాగే అమెరికన్ ఫిలిమ్స్ చెన్నై స్టోరీస్ లో కూడా నటిస్తోంది.