” ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ” మూవీ సెకండ్ హీరోయిన్ గుర్తుందా… ఈమె ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు…!!

స్టార్ హీరోయిన్ వినీత అంటే పెద్దగా ఎవరు గుర్తుపట్టకపోవచ్చు. కానీ..” ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ” సినిమాలో మనీషా అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈమె ఈ సినిమాలో నేపాల్ అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలను పొందింది. ఇక ఈమె అందం, అభినయంతో ఎంతోమందికి దగ్గర అయింది కూడా. ఇక ఈ ముద్దుగుమ్మ 1993 వ సంవత్సరంలో తమిళ్ పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె దాదాపు 70కి పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్గా నిలిచింది. దాదాపు అందరి స్టార్ హీరోల సరుసున నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా అనంతరం ఈమె కి సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. ఈ క్రమంలోనే సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించడం మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ.. వ్యభిచారం కేసులో పట్టుబడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి జైలులో సైతం వేశారు.

చాలామందికి వినీత డబ్బు ఆశ చూపి అలాంటి పనులు చేపిస్తుందని ఆరోపణలు సైతం చేశారు. ఇక కొన్ని సంవత్సరాల పాటు ఈ కేసు నడిసింది. ఆ తర్వాత వినీత మానసిక స్థితి సరిగ్గా లేదని జైల్లో నుంచి విడుదల చేశారు. ఇక జైల్లో నుంచి బయటకు వచ్చిన కొంతకాలానికి.. సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈమె ఎవ్వరు గుర్తుపట్టలేనంత గా మారిపోయింది. తన మునుపటి ఆకారాన్ని పూర్తిగా కోల్పోయి అంద వికారంగా మారింది వినీత. ఇక ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు వివాహం చేసుకోకుండా సింగిల్గానే ఉంది.