Rajinikanth birth day spl: బస్ కండక్టర్ టు సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ జర్నీసూప‌ర్‌..

కొలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులలో కూడా భారీ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రజినీకాంత్ ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటికే పలు భాషల్లో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న రజినీకాంత్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. నటుడు గానే కాకుండా నిర్మాతగా, రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. రజిని తమిళ్ యాక్టర్ అయినా తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు.

ఇక ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రజనీకాంత్ మొదట్లో బెంగుళూర్‌లో బస్సు నెంబర్ 134 కి కండక్టర్గా పని చేసేవాడు. అప్పట్లో ఎక్కువగా కాలేజ్ అమ్మాయిలు రజనీకాంత్ స్టైల్ చూడడానికే ఆ బస్సు ఎక్కే వారిని ర‌జినీ స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యులో వివ‌రించాడు. అయితే తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలను ఎదురుకున్న రజినీకాంత్ మెల్లమెల్లగా హీరోగా మారాడు. రజనీకాంత్ కు నటన పై ఉన్న ఆసక్తిని గమనించి తన తరఫున రజనీకి తెలియకుండా ఫిలిం ఇన్స్టిట్యూట్ కి ఒక అప్లికేష‌న్ పంపించారట. అలా ఆయన నటన పైన ఆసక్తితో రజినీకాంత్ 1975లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రంగా సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

1995లో రిలీజ్ అయిన భాష సినిమా రజినీకాంత్ కెరీర్‌ను మ‌లుపు తిప్పింది. ఈ సినిమాతో రజినీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టి వరుస సినిమా అవకాశాలను అందుకుంటు వచ్చాడు. తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి సూపర్ స్టార్ గా మారిన రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో రూ.100 కోట్ల భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. రజిని అన్ని భాషల్లో కలిపి 169 సినిమాలో నటించాడు. ఇక ప్రస్తుతం తన 170 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. రజనీకాంత్‌ని సూపర్ స్టార్ తలైవారని కూడా అభిమానులు ముద్దుగా పిలుస్తూ ఉంటారు. తన కెరీర్‌లో ఎన్నో రివార్డులు అవార్డులను అందుకున్న రజినీకాంత్ 73వ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు సినీవర్గాల నుంచి విషెస్ వెలువెత్తాయి.