వరల్డ్ టాప్ మ్యాగజైన్ కవర్ పేజీపై చోటు దక్కించుకున్న చెర్రీ – ఉపాసన.. స్టైలిష్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా..

రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ఎంతమంది ప్రజలకు స్ఫూర్తిగా ఉంటారు. ఈ జంటకు 2023 అన్ని రకాలుగా లక్కీ ఇయర్ అని చెపవ‌చ్చు. బేబీ క్లిన్ కారా పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీలో అంతా చేంజ్ అయిపోయింది. వీరిద్దరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చెర్రీ ఇప్పుడు మరింత ఉత్సాహంగా గేమ్ చేంజ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాల ప్రణాళికను రచించిన చెర్రీ మరోవైపు భార్య, కుమార్తెతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉండడం సోషల్ మీడియాలో చర్చనీయా అంశం అయ్యింది.

ఇంతలోనే ఈ జంటకు మరో అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్స్ టాప్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఎడిషన్ కవర్ పేజ్‌ పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన ప్రత్యేకం అంటూ వారు స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోతో ప్రింట్ చేసింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటో మెగా అభిమానుల్లో వైరల్ గా మారింది. ఇక ఈ కవర్ పేజీపై చెర్రీ, ఉపాసనాల లుక్ చాలా స్టైలిష్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇందులో రామ్ చరణ్ పింక్ స్వెట్ ష‌ర్ట్ ధరించి ఫార్మల్ ప్యాంట్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు. అతడు చెంతనే ఉన్న ఉపాసన గులాబీ రెడ్ గౌన్ లో మెరిసింది. జంట చూడడానికి కన్నుల విందుగా కనిపించడంతోపాటు చాలా స్టైలిష్ లుక్ లో అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నారు.

Photo Moment: Ram Charan and Upasana meet Maharashtra's CM Eknath Shinde |  123telugu.com

ప్రస్తుతం ఈ మ్యాగజైన్ పిక్‌ వైరల్ గా మారడంతో ఈ కపుల్ ఎంతో అందంగా కనిపిస్తున్నారంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు రామ్‌చరణ్ – ఉపాసన చాలా కమిట్మెంట్లను కంప్లీట్ చేసేందుకు ముంబైలో విహ‌రిస్తున్నారు. క్లింకార ఆరు నెలల పూర్తైన నేప‌ధ్యంలో ఈ జంట మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకుని సెలెబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఓ ముఖ్యమైన సందర్భం కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాధ్ షిండేని కలిశారు. ఈ వేడుకలు అతిధులను స్వాగతించేందుకు షిండే కుమారుడు శ్రీకాంత్ కూడా అటెండ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో సాంప్రదాయ తిలక్ వేడుక.. షిండే కోడలు వృసాలి హారతి కార్యక్రమం.. చరణ్ కుటుంబానికి అతిథి సాంప్రదాయాలు అందించడం గ్రాండ్ గా జరిగాయి.