సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేశాయోచ్.. బాహుబలి రికార్డులు తుక్కు తుక్కు..హైయెస్ట్ రికార్డ్ ఇన్ హిస్టరీ ..టోటల్ ఎన్ని వందల కోట్లంటే..?

ఇది నిజంగా ప్రభాస్ కెరియర్ లోనే ఓ మైల్ స్టోన్ అని చెప్పాలి. రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ సినిమా ప్రభాస్ కెరియర్ లో బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . అంతకుముందు ప్రభాస్ ఖాతాలో ఎన్ని హిట్స్ ఉన్నా కానీ ప్రత్యేకంగా నిలవడం గమనార్హం. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా నటించిన సినిమాని ఈ సలార్ .

ఫుల్ టు ఫుల్ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ బెస్ తో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. అప్పటివరకు సైలెంట్ పాత్రలో చూసిన ప్రభాస్ ని ఇంత వైలెంట్ యాంగిల్ చూడడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా దేవా పాత్రకు బాగా కనెక్ట్ అయిపోయారు. కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ కి సంబంధించిన టాక్ బయటకు వచ్చింది . అందుతున్న సమాచారం ప్రకారం సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి పడేస్తున్నాయి .

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజుల్లో కలెక్షన్లు గతంలో కనివిని ఎరుగని రేంజ్ లో కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . శుక్రవారం 175 కోట్లకు పైగా వసూలు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దేశవ్యాప్తంగా 135 కోట్లు వసూలు అందుకున్నట్లు తెలుస్తుంది. వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ ఏడాదిలో మొదటి రోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చిన చిత్రంగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. తర్వాత స్థానాలలో లియో – ఆది పురుష్ సినిమాలు ఆ స్థానాన్ని దక్కించుకున్నాయి. బాహుబలి రికార్డులను సైతం చిత్తుచిత్తు చేయడంతో సలార్ సినిమా సెన్సేషనల్ రికార్డును బ్రేక్ చేసినట్లయింది..!!