కొత్త బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన రష్మిక.. కేక పెట్టిస్తున్న కటౌట్.. మళ్లీ కన్నడ కుర్రాడేనా..?

రష్మిక మందన్నా.. ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . రీసెంట్గా రిలీజ్ అయిన యానిమల్ సినిమాతో బోల్డ్ బ్యూటీగా ట్యాగ్ చేయించుకుంది. త్వరలోనే పుష్ప2తో మరోహిట్ ని తన ఖాతాలో వేసుకొని గ్లోబల్ బ్యూటీగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయిపోతుంది . ఇలాంటి మూమెంట్లోని రష్మిక నటిస్తున్న సినిమాలకు సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి.

రష్మిక రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే . ఇది ఫుల్ టు ఫుల్ క్లాసిక్ ప్రేమ – ఫ్రెండ్షిప్ ఎమోషన్స్ తో తెరకెక్కుతుంది . తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక బాయ్ ఫ్రెండ్ ని ప్రకటించారు మేకర్స్ . ఈ సినిమాలో రష్మికకు బాయ్ ఫ్రెండ్ గా కన్నడ నటుడు దీక్షిత్ సెట్టి నటిస్తున్నాడు. ఇతగాడి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు .

తెలుగు కన్నడ సినిమాలలో నటించాడు . కన్నడలో దియా సినిమాతో బాగా ఫేమస్ అయిపోయాడు . ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మికకు జోడిగా నటిస్తున్నాడు . ఆయన క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ రష్మిక వాయిస్ ఓవర్ లో వీడియో వైరల్ అవుతుంది. “ఇతడే నా బాయ్ ఫ్రెండ్ పేరు విక్కీ .. విక్రం .. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ బళ్ళారి అబ్బాయి . విక్కినే మా కాలేజీలో టీం విరాట్ కోహ్లీ విక్రమ్ స్మైల్ చేస్తే చాలు అమ్మాయిలంతా పడిపోతారు “అంటూ తనదైన వాయిస్ బేస్ తో చెబుతూ సినిమా పై హైప్స్ పెంచేసింది .

అయితే రష్మిక రేంజ్ కి దీక్షిత్ చాలా తక్కువ . ఆమె నేషనల్ క్రష్ అయినా మేకర్స్ ఎందుకు ఆయనను ఈ సినిమాలో హీరోగా చూస్ చేసుకున్నారు అన్నది తెలియడం లేదు . మొత్తానికి రష్మిక కొత్త బాయ్ ఫ్రెండ్ కూడా కన్నడ కుర్రాడే కావడం ఆమె కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వైరల్ అవుతుంది..!!