సలార్ లో నటించిన నటినటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? అందరికన్నా చీప్ పారితోషకం ఆయనకే..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో మనం చూస్తున్నాం . చిన్నా పెద్ద తేడా లేకుండా కోట్లు కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారు. అయితే చిన్న చిన్న సినిమాలో నటించే వాళ్లే కోట్లు తీసుకుంటూ ఉంటే పెద్ద పెద్ద సినిమాల్లో నటించి కోట్లు ప్రాఫిట్స్ తీసుకొచ్చే వాళ్లు మరి ఎంత రెమ్యూనరేషన్ తీసుకోవాలి . ప్రజెంట్ సలార్ సినిమాకి సంబంధించిన నటీనటుల రెమ్యూనరేషన్ డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి .

సలార్ సినిమాలో నటించిన నటుల రెమ్యూనరేషన్ డీటెయిల్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఈ సినిమాలో దేవ పాత్ర పోషించిన ప్రభాస్ ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్ల పారితోషకం తీసుకున్నారట . అంతేకాదు లాభాల్లో కూడా 10% షేర్ తీసుకున్నట్లు వినిపిస్తుంది. డైరెక్టర్ ప్రశాంత నీల్ కూడా 60 కోట్లు చార్జ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే సినిమాలో హీరోయిన్ నటించిన శృతిహాసన్ కేవలం ఎనిమిది కోట్లు మాత్రమే ఛార్జ్ చేసిందట .

అంతేకాదు ఫ్రెండ్ పాత్ర నటించిన పృథ్వీరాజ్ – జగపతిబాబు కూడా ఎనిమిది కోట్లు ఛార్జ్ చేయడం గమనార్హం . సినిమాలో ప్రభాస్ తో ఈక్వల్ గా చేసిన పాత్ర పృథ్వీరాజ్ కేవలం 8 కోట్లే తీసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సలార్ మొదటి రోజు ఏకంగా 175 కోట్లు కలెక్ట్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!