“సలార్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం అంత ఆయనే”.. స్టేజి పైనే యాంకర్ రవికి ఇచ్చి పడేసిన శృతిహాసన్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ తాజాగా నటించిన సలార్ సినిమాకి సంబంధించిన టాక్ ఎక్కువగా వినిపిస్తుంది . బాహుబలి సినిమా తర్వాత ఒక హిట్ అందుకొని ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ సంపాదించుకుంది . అంతేకాదు మొదటి రోజే ఏకంగా 175 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది .

ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేదు . అయితే రీసెంట్గా షోకి మాత్రం గెస్ట్ గా హాజరైంది . దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది . యాంకర్ రవి ఈ షోని హోస్ట్ చేస్తున్నారు. కాగా ఆకాశం అమ్మాయి అయితే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ని తర్వాత సలార్ సినిమాకి సంబంధించి రకరకాల ప్రశ్నలు వేశారు . అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పింది శృతిహాసన్.

ఈ క్రమం లోనే యాంకర్ రవి సలార్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి కారణం ప్రభాస్ శృతిహాసన్ పోషించిన పాత్రలే అంటూ చెప్పుకొస్తాడు . వెంటనే రవి అభిప్రాయాన్ని ఖండించింది శృతిహాసన్. “కాదు కాదు కాదు సినిమా హిట్ అవ్వడానికి నేను ప్రభాస్ కారణం కాదు ..కర్త – కర్మ – క్రియ అంతా కూడా ప్రశాంత్ నీల్ నే.. ఈ విషయం ప్రభాస్ కి తెలుసు .. ఏదైనా ఒక విజన్ తోనే ప్రారంభమవుతుంది ..ఆ విషయంకి కారణం ఇక్కడ ప్రశాంత్ నీల్” అంటూ యాంకర్ రవికి స్టేజ్ పైన ఇచ్చి పడేసింది . ప్రెసెంట్ శృతిహాసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.