ప్ర‌స్తుతం రూ. 100 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్న ప్రభాస్.. మొదటి పారితోష‌కం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!

పాన్ ఇండియా లెవెల్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాలీవుడ్ హీరోల లిస్ట్‌లో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటాడు. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సార్ గా మారిన ప్రభాస్ ఈ సినిమా తర్వాత అన్ని పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్టుల‌కే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ముందుకు వెళ్తున్నాడు.

బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అందరూ దర్శకులతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ప్రభాస్.. ఒక్క సినిమాకు రూ.100 నుంచి 150 కోట్ల వరకు రెమ్యున‌రేషన్ అందుకుంటాడని సమాచారం. ఇక ప్రభాస్ రేంజ్ తెలిసినా కూడా ఈ రేంజ్ లో రమ్యున‌రేషన్ ఇచ్చేందుకు ఎక్కడ వెనకాడరు. ఇక తాజాగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన సలార్‌ సినిమాతో ప్రభాస్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన క్రేజ్ ను మరింతగా పెంచుకున్నాడు. ఈ సినిమాతో మరింత రెమ్యూనరేషన్ పెంచే ఛాన్సులు కూడా ఉన్నాయి.

అయితే ప్రస్తుతం రూ.100 నుంచి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్న ప్రభాస్ తన మొదటి సినిమా ఈశ్వర్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు తెలుసుకోవాల‌నే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అయితే ప్రభాస్ తన మొదటి సినిమాకు కేవలం రూ.5 లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నాడట. ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ ఈ విషయాన్ని స్వయంగా వివరించాడు. అయితే ప్రభాస్ హీరో అవ్వకపోయి ఉంటే ఏమయ్యేవాడు అని ఇంటర్వ్యూ వర్‌ అడగగ‌ నేను అసలు యాక్టర్ కావాల‌నుకోలేదు.. బిజినెస్‌మ్యాన్‌ కావాలని భావించా అంటూ వివరించాడు.