దూత సిరీస్ రిలీజ్‌.. చైతూపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. కోపానికి కార‌ణం ఇదే..

అక్కినేని నాగచైతన్య ఇటీవల నటించిన వెబ్ సిరీస్ దూత. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. దూత సిరీస్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. చాలామంది ఈ సిరీస్ ని మెచ్చుకున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సిరీస్‌ను ఉంజాయ్ చేస్తున్నారు. ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా.. వాళ్ళ హీరోస్‌లా చాలా కూల్ గా ఉంటారు. కానీ కోపం వస్తే మాత్రం ఫైరింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు అదే ట్రోలింగ్స్ ను ఫ్యాన్స్ నుంచి నాగచైతన్య ఎదుర్కొంటున్నాడు.

Dhootha (TV Series 2023– ) - IMDb

దూత వెబ్ సిరీస్ తో మంచి రెస్పాన్స్ అందుకున్నాడు.. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇలాంటి టైంలో ఫ్యాన్స్ చైతు పై ఫైర్ అవడం ఏంటి..? అసలు ఏం జరిగింది..? అనుకుంటున్నారా. గతంలోనే విక్రమ్ కుమార్ – నాగచైతన్య కాంబినేషన్లో థాంక్యూ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాచైతుకి పెద్ద‌ డిజాస్టర్ గా నిలిచింది. అదే టైంలో విక్రమ్.. చైతూతో దూత సిరీస్ గురించి చర్చించాడట.

Naga Chaitanya's debut OTT series Dootha to arrive on Prime Video on  December 1 | Ott News - News9live

థాంక్యూ అనే రోటీన్ తలతిక్కల సినిమాను చేసే బదులుగా దూత కథ‌నే ముందే సినిమాగా తీసి ఉంటే ఈపాటికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ నాగచైతన్య ఖాతాలో ఉండేది కదా అని భావిస్తున్నారు. ఇంత ఆలస్యం చేసి.. ఇన్ని ప్లాప్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దూతకు ఊహించిన రేంజ్ లో ఆదరణ రాదు అంటు.. చైతన్య ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బంగార్రాజు తర్వాత నాగచైతన్యకు హిట్టే లేదు. భారీ అంచనాలతో వచ్చిన కస్టడీ సినిమా కూడా బోల్తా పడింది.ఇలాంటి సమయంలోనైనా కనీసం దూతను వెబ్ సిరీస్ లా కాకుండా సినిమాగా తెరకెక్కించాల్సింది అంటూ చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Naga Chaitanya's Dootha Arriving

ఇక ఇప్పటికే సిరీస్ మొదలైపోయింది.. సో చేసేదేంలేదు.ఇక దూత ప్రచారాన్ని పూర్తి చేసిన నాగచైతన్య ప్రస్తుతం తాండెల్ సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు ఈ సినిమాలో సాయి పల్లవి చైతుతో జతకట్ట పోతుంది గతంలో వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి హిట్ అందుకుంది దీంతో వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న థండెల్ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి ఇక నాగచైతన్య కూడా తండేల్ మూవీ సక్సెస్ ఇచ్చి కెరియర్ను ఓ మంచి మలుపు తిప్పుతుందని భావిస్తున్నాడు