సిల్క్ స్మిత పుట్టిన రోజు స్పెషల్: మరో బయోపిక్ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఆమెలా నటించే హీరోయిన్ ఎవరో తెలిస్తే ఎగిరి గంత్తెస్తారు..!!

సిల్క్ స్మిత .. ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ పేరు చెప్తే జనాలు ఓ రేంజ్ లో ఊగిపోయేవారు. ఇప్పటి జనాలకి ఈ పేరు యొక్క ప్రత్యేకత తెలియదేమో గాని .. మన ఇంట్లోని నాన్నలకు తాతలకు ఈ పేరు చెప్తే ఎక్కడలేని ఊపు వచ్చేస్తుంది. అంతలా సినిమా ఇండస్ట్రీలో తన నటనతో ఆకట్టుకుంది సిల్క్ స్మిత . ఒకప్పటి అందాల నటి . సౌత్ ప్రేక్షకులను ముఖ్యంగా యూత్ ని ఉర్రుతలూగించిన ఈ అందాల తార సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయింది .

స్టార్ హీరోలకి మించిన రెమ్యూనరేషన్ తీసుకొని స్టార్ స్టేటస్ లైఫ్ ని ఎంజాయ్ చేసిన సిల్క్ స్మిత ఒకానొక దశలో అనుకోకుండా కొన్ని పరిస్థితుల కారణంగా కృంగిపోవడంతో ఆత్మహత్య చేసుకుని మరణించింది . ఈమె సూసైడ్ అప్పట్లో సంచలనంగా మారింది . సిల్క్ స్మిత ని తలుచుకొని ఇప్పటికీ పలువురు జనాలు బాధపడుతున్నారు అంటే దానికి కారణం ఆమె మంచితనం . తెరపై బోల్డ్ పాత్రలో నటించింది కానీ తెర వెనక మాత్రం సిల్క్ స్మిత చాలా మంచిది అంటూ అప్పట్లో జనాలు చెప్పుకు వచ్చేవారు .

సిల్క్ స్మిత బయోపిక్ లు కూడా వచ్చాయి . మరి ముఖ్యంగా విద్యాబాలన్ మెయిన్ లీడ్ లో నటించి సిల్క్ స్మిత జీవితం ఎలా గడిచింది అనేది చెప్పింది . అయితే తాజాగా సిల్క్ స్మిత మరో బయోపిక్ తెరకెక్కబోతుంది. నేడు డిసెంబర్ 2 ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆమె బయోపిక్ ని అనౌన్స్ చేశారు. ఇండియన్ ఆస్ట్రేలియా నటి చంద్రిక రవి ఈ సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో కనిపించబోతుంది. నేడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు . “సిల్క్ స్మిత అన్ టోల్డ్ స్టోరీ” అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. చంద్రిక రవి అచ్చం సిల్క్ స్మితల కనపడేలా మేకప్ చేసి ఆకట్టుకున్నారు సినీ మేకర్స్ . దీంతో సినిమా ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది..!!