బిగ్ బ్రేకింగ్: హాస్పిటల్ లో అడ్మిట్ అయిన అల్లు అర్జున్..? పుష్ప 2 సినిమాకు బ్రేక్.. ఏమైందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప2 సినిమాకి బ్రేక్ చెప్పారా..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప2 రాబోతుంది . ఈ సినిమా ద్వారా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి చాలా బాగా కష్టపడుతున్నాడు బన్నీ.

ఆల్మోస్ట్ ఆల్ ఒక్క పాట కొన్ని సీన్స్ మినహా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం చిత్రీకరణ పూర్తయింది . ఈ సినిమాని ఓ రేంజ్ లో తెరకెక్కించేలా ప్లాన్ చేసుకున్నాడు సుకుమార్ . అయితే ఐటమ్ సాంగ్ షూట్ చేయడానికి ప్లాన్ చేసుకున్న సుకుమార్ ఐటమ్ సాంగ్ పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తుంది . దానికి కారణం అల్లు అర్జున్ కు అనారోగ్యంగా ఉండటమే . ఆయన వైరల్ ఫీవర్ కారణంగా చాలా బాధపడుతున్నారట .

ఈ క్రమంలోని హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఈ సినిమా కోసం బన్నీ కొన్ని నెలలుగా విరామం లేకుండా షూట్ చేస్తున్నాడు . మరోపక్క ఫ్యామిలీ ఫంక్షన్స్ మరోపక్క షూట్ తో ఫుల్ నలిగిపోయిన బన్నీ వైరల్ ఫీవర్ కారణంగా బాధపడుతున్నారట . ఈ క్రమంలోనే ఆయన మరింత సిక్ అవ్వడంతో హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయాలి అంటూ డాక్టర్ సజెస్ట్ చేశారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

ఈ క్రమంలోనే సుకుమార్ పుష్ప2 సినిమాకు బ్రేక్ చెప్పాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే దీనిపై ఇంతవరకు పుష్ప 2 టీం స్పందించనేలేదు . దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తే బాగుండు . ఆయన ఆరోగ్యం ఎలా ఉంది ..? అంటూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు..!!