టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో కంటే విలన్ ఎక్కువగా డామినేట్ చేసిన సినిమాలు ఇవే..

ఒకప్పుడు సినిమా అంటే మొత్తం హీరో డామినేషన్ ఉండేది. అలాంటిది ఇప్పుడు మాత్రం హీరో పాత్రకి దీటుగా విలన్ పాత్రలు ఉంటున్నాయి. అందుకేనేమో ప్రస్తుతం కొంతమంది స్టార్ హీరోలు కూడా విలన్ పాత్రలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే హీరో కంటే విలన్ ఎక్కువగా డామినేట్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్పైడర్’ సినిమా లో మహేష్ బాబు హీరోగా నటించగా,విలన్  పాత్రలో స్టార్ హీరో సూర్య నటించారు. అలానే తేజ దర్శకత్వం లో మహేష్ బాబు హీరోగా నటించిన ‘నిజం’ సినిమాలో హీరో గోపీచంద్ విలన్ గా నటించారు. అంతేకాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వన్ లో మహేష్ హీరోగా నటించిన సినిమా ‘అతిధి ‘లో మురళి వర్మ విలన్ గా నటించారు.

లొకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘మాస్టర్’ సినిమా లో విజయ్ హీరోగా నటించగా, విజయ్ సేతుపతి విలన్ గా నటించారు.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’ సినిమా లో అరవింద స్వామి విలన్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. సురేందర్ రెడ్డి ఈ సినిమా కి దర్శకత్వం వహించారు.

విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నాని హీరోగా నటించగా విలన్ పాత్రలో కార్తికేయ నటించారు.

ఇక విశాల్ హీరోగా తెరకెక్కిన ‘అభిమన్యుడు’ సినిమాలో అర్జున్ విలన్ గా నటించారు. పి ఎస్ మిత్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

రాజమౌళి దర్శకత్వం వహించిన పాన్ ఇండియా సినిమా ‘బాహుబలి’ లో ప్రభాస్ హీరోగా నటించగా,రానా విలన్ పాత్రలో నటించారు.

ఇక నితిన్ హీరోగా నటించిన ‘జయం’ సినిమాలో గోపీచంద్ విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించాడు.