గ్యాస్, అసిడిటీ సమస్యకు ఈ చిన్న చిట్కా పాటిస్తే వెంట‌నే మటుమాయం…!

మారుతున్న లైఫ్‌స్టైల్‌ కారణంగా లేదా మనం తినే ఆహారంలో మార్పు కారణంగా గ్యాస్, యాసిడిటీ వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు వేసవిలో ఇంకాస్త ఎక్కువగా మారుతాయి. ఎందుకంటే వేసవిలో మనం తీసుకునే ఆహారం చాలా త్వరగా పాడవడం లేదా తీసుకునే ఆయిల్ ఫుడ్స్ కారణంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు కడుపు ఉబ్బరంగాను, ఎంతో బద్ధకం గాను ఉంటుంది. ఇంకా ఈ గ్యాస్, ఎసిడిటీ కారణంగా తల తిరగడంతో పాటు వాంతులు, విరోచనాలు కూడా మొదలయ్యే ప్రమాదం ఉంది.

అయితే వేసవిలో వచ్చే ఈ ఉదర సమస్యలను తగ్గించుకోవడానికి వంటింటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కడుపులో ఏర్పడే గ్యాస్ సమస్యను తగ్గించడంలో అల్లం దివ్యౌషధం లా పని చేస్తుంది. గ్యాస్ అధికంగా ఉన్నప్పుడు చిన్న అల్లం ముక్కను నమిలి మింగాలి. దాంతో వెంటనే గ్యాస్ సమస్య పోతుంది. అలాగే అల్లం టీ తాగినా కూడా గ్యాస్ నుంచి త్వరగా బయటపడవచ్చు. ఇక పుదీనా రసం, నిమ్మరసం, బేకింగ్ సాడా వంటివి కూడా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కొన్నిసార్లు డిహైడ్రేట్స్ వల్ల కూడా గ్యాస్, అసిడిటీ ఫామ్ అవుతుంది. కాబట్టి డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు మీరు ఎక్కువగా నీరు తాగాలి. అలాగే నీటితో పాటు నిమ్మరసం, కొబ్బరినీళ్లు వంటివి కూడా తాగాలి. అన్నిటికంటే ముఖ్యం భోజనం చేసిన తరువాత కనీసం 30 నిమిషాలు కూర్చోవాలి లేదా కొద్దిసేపు పాటు నడవాలి. ఒకవేళ పడుకుంటే గ్యాస్, ఎసిడిటీ సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉంది ‌ ఇక గ్యాస్ సమస్య నుంచి త్వరగా ఉపశమనం కలిగించడానికి లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర వంటివి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు.