చిరంజీవి కారణంగా నవ్వుల పాలైన స్టార్ హీరో .. ఎవరో తెలుసా..?

ఆ తరంలో స్వయంకృషితో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన స్టార్ హీరోలు ఎవరు అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేర్లు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ. ఈ స్టార్ హీరోల మాదిరిగానే ఆ తర్వాత తరంలో స్వయం కృషితో పైకి వచ్చిన హీరో ఎవరని అడగగానే గుర్తుకొచ్చే పేరు చిరంజీవి. చిరంజీవి స్వయంకృషితో సినీ ఇండస్ట్రీలో తనకంటూ గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అయితే ఓ సందర్భంలో చిరంజీవి వల్ల ఓ సీనియర్ హీరో నవ్వుల పాలయ్యాడట. ఇంతకీ ఆ హీరో ఎవరు? అసలేం జరిగిందో తెలుసుకుందాం.

టాలీవుడ్ లో ఎన్టీఆర్ కంటే ముందు అడుగు పెట్టి ఎవర్గ్రీన్ హీరోగా స్టార్‌డంని సొంతం చేసుకున్నాడు ఏఎన్ఆర్. అప్పట్లో మహిళా ప్రేక్షకుల్లో ఏఎన్నార్‌కి ఒక ప్రత్యేకమైన హోదా ఉండేది. ఇంకా చెప్పాలంటే ఆయన అప్పట్లో మహిళా ప్రేక్షకుల్లో లవర్ బాయ్ స్టేటస్‌ని సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్, శోభన్‌ బాబు, కృష్ణ వంటి హీరోలు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న సమయంలోనే చిరంజీవి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి వారితో పలు సినిమాల్లో సెకండ్ హీరో పాత్రలో పోషించాడు. కానీ అప్పటికి చిరు ఏఎన్నార్ తో నటించలేదు. ఆ తరువాత చిరంజీవికి 80వ దశాబ్దంలో ఆ అవ‌కాశం వచ్చింది. అలా తొలిసారి అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి కలిసి నటించిన సినిమా ” మెకానిక్ అల్లుడు ” .

1983లో ఈ సినిమా థియేటర్ వద్ద రిలీజ్ అయింది. ఇద్దరి హీరోలా తొలి కాంబినేషన్ సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. బి. గోపాల్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా ఈ మూవీను తెరికెక్కించాడు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరోయిన్ గా నటించింది. ఇక చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా ఇదే కావడం విశేషం. మెకానిక్ అల్లుడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవిపై చిత్రీకరించిన “గురువా గురువా” పాట ఎంతో ఫేమస్ అయ్యింది.

ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి కాంబినేషన్లో ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన “శ్రీరంగనీతులు” సినిమాకు రీమేక్. శ్రీరంగనీతులు సినిమాకి జిరాక్స్ కాపీలా తెరకెక్కిన మెకానిక్ అల్లుడు సినిమా ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేసింది. ఆ యేడాది ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజ్ వంటి హీరోలు హిట్ అందుకుంటే.. అక్కినేని నాగేశ్వరరావు మాత్రం చిరంజీవితో కలిసి నటించిన మెకానిక్ అల్లుడు చిత్రంతో అవమానల‌ పాలైయ్యాడు.