సీనియర్ ఎన్టీఆర్ ని హర్ట్ చేసిన చిరంజీవి..ఇన్నాళ్లకు బయటపడిన టాప్ సీక్రెట్..!

నటరత్న ఎన్టీఆర్ తన సినీ కెరీర్లో పౌరాణిక, జానపద, సాంఘికం వంటి ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికీ పౌరాణిక సినిమాలు గుర్తుకు వస్తే నటరత్న ఎన్టీఆర్ ఏ గుర్తుకు వస్తారు. ఆయన చేసిన దాన వీర శూర కర్ణ, సీతారామ కళ్యాణం, మాయాబజార్ వంటి సినిమాలు చూస్తుంటే అచ్చం కృష్ణుడు, రాముడు మన కళ్ళ ముందే కనిపించే విధంగా ఆయన తన నటనతో మెప్పించాడు. ఇప్పటికీ కూడా కృష్ణుడు, రాముడు అనగానే నటరత్న ఎన్టీఆరే గుర్తుకు వస్తారు.

వీటితోపాటు సాంఘిక సినిమాలు కూడా ఎంతో అద్భుతంగా నటించారు. అయితే ఇప్పుడు అయిన తర్వాత తరం వచ్చిన వారిలో బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లోనే అగ్ర హీరోగా ఎదిగాడు.
చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో కి అడుగుపెట్టి పునాదిరాళ్లు సినిమా నుంచి నేటి వాల్తేరు వీరయ్య సినిమా వరకు ఎంతో అద్భుతంగా తన అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు.
ఇక నటన డాన్స్ విషయంలో చిరంజీవి టాలీవుడ్ ను కొత్త పుంతలు తొక్కించాడు. డాన్స్ లో ఆయనకు ఆయనే సాటి అనే విధంగా ఇప్పటికీ నేటితరం హీరోలకు పోటీ ఇస్తున్నాడు.

చిరంజీవి నట ప్రస్థానంలో ఎన్నో ఆసక్తికర విషయాలు జరిగాయి. వాటిలో ఎవరికీ తెలియని ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే.. చిరంజీవి తన సినీ కెరీర్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తో కూడా సినిమాలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు తో చిరు మెకానిక్ అల్లుడు సినిమాలో నటించాడు. అంతేకాకుండా నటరత్న ఎన్టీఆర్ తో తిరుగులేని మనిషి సినిమాలో నటించాడు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తో మరో సినిమా చేసే అవకాశం చిరంజీవికి వచ్చింది.. కానీ ఆ సినిమా ఐదు రోజులు షూటింగ్ తర్వాత చిరంజీవి స్థానంలో మోహన్ బాబుని పెట్టుకున్నారు.

Kondaveeti Simham Telugu Full Length Movie || N. T. Rama Rao, Sridevi,  Mohan Babu - YouTube

ఆ సినిమా ఏంటి..? చిరంజీవిని ఎందుకు తప్పించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కొండవీటి సింహం సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొడుకు పాత్ర కోసం ముందుగా దర్శకుడు చిరంజీవిని తీసుకున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు కొడుకుగా నటించే చిరంజీవి ఆయనను ఎదిరిస్తూ పవర్ఫుల్ డైలాగులు చెప్పాల్సి ఉంటుంది. చిరంజీవి కూడా ఆ పాత్రకు ఒప్పుకున్నాడు. ఐదు రోజుల షూటింగ్లో కూడా పాల్గొని.. అయితే ఎన్టీఆర్‌కు ఎదురు చెబుతూ డైలాగులు చెప్పేందుకు చిరంజీవి కాస్త తడబడ్డాడు.

దానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ అప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమంలోనే మకుటం లేని మహారాజుగా కొనసాగుతున్నాడు. కానీ చిరంజీవి అప్పుడప్పుడే కెరీర్ ను గాడిలో పెట్టుకుంటున్నాడు. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం కేవలం 30 రోజులు మాత్రమే తన డేట్స్ ఇచ్చారు. దాంతో ఈ సినిమా షూటింగ్ ఇలాగే జరిగితే కష్టమని అనుకున్న మేకర్స్ ఆ సమయంలోనే చిరంజీవి స్థానంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబుని తీసుకున్నారు. అలా మోహన్ బాబు.. ఎన్టీఆర్ కొండవీటి సింహం సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, ఎన్టీఆర్ కి పోటీగా తన నటనతో డైలాగులతో పోటీపడి నటించారు. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిరంజీవి ఈ విధంగా తనకు వచ్చిన అరుదైన అవకాశాన్ని చేతులారా పాడు చేసుకున్నాడు.