అనన్య పాండేకు ఘోర అవమానం.. ఆ స్టార్ హీరో తనయుడు అలా చేశాడేంటి?

బాలీవుడ్ భామ అనన్య పాండే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన `లైగర్` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని రీతిలో డిజాస్టర్ అయింది. దానికి కారణం హీరోయిన్ కూడా ఈ సినిమాకి పెద్ద మైనస్ అంటూ అనన్య పాండే నటనపై నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది.

ఇటీవల అనన్య పాండే ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన మనసులో మాట బయట పెట్టింది. అదేమిటంటే షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అంటే తనకి క్రష్ అని చెప్పుకొచ్చింది. తాజాగా అనన్య ‘మజా మా’ సినిమా స్క్రీనింగ్ వెళ్లగా అక్కడ ఆర్యన్ ఖాన్ కంటపడ్డాడు. కానీ ఆర్యన్ ఈ బ్యూటీనీ అసలు కళ్ళు తిప్పి చూడకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

కనీసం అతడి కారు డ్రైవర్ కూడా ఆమెను పట్టించుకోలేదు. ఆర్యన్ కి మరీ ఇంత ఆటిట్యూడ్ ఏంటీ? ఎంత స్టార్ కొడుకైతే మాత్రం అంతలా ఆటిట్యూట్ చూపించాలా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అనన్య పాండేకి జరిగిన ఘోర అవమానం గురించి.. ఆర్యన్ అలా ప్రవర్తించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.