విజయశాంతి పిల్లల్ని కనకపోవడానికి కారణం..?

అతి చిన్న వయసులోని సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ విజయశాంతి. గ్లామరస్ పాత్రలలో తన కెరీర్ మొదలు పెట్టి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాకుండా ఇండియన్ హిస్టరీ లోనే లేడీస్ సూపర్ స్టార్ గా కూడా పేరును సంపాదించుకున్న ఏకైక నటి అని చెప్పవచ్చు. నేటి భారతం, ఒసేయ్ రాములమ్మ తదితర సినిమాలతో ఒకసారిగా స్టార్ డమ్ ను సంపాదించుకుంది. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేశాక రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అయితే మహేష్ బాబు తో సరిలేరు నీకెవరు సినిమాతో చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చింది విజయశాంతి.

Actress Vijayashanthi reveals the reason why she didn't have kids! - We  Magazine Simple And Sensible
అంతేకాకుండా ఈ మధ్య మీడియా ముందుకు కూడా ఎక్కువగా కనిపించలేదు తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికరమైన విషయాలు గురించి ఒకానోక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఎప్పుడు తన వ్యక్తిగత విషయాలను బయట పెట్టలేదు. ఇక విజయశాంతి భర్త పేరు శ్రీనివాసరావు ప్రసాద్. విజయశాంతి తండ్రి పేరు కూడా ఇదే పేరు కావడం విశేషమని చెప్పవచ్చు. అందుచేతనే తన భర్తను నాన్న పేరుతో ఇష్టం లేక తనని చిన్ని అని పిలుస్తూ ఉండేదట.

Vijayashanti age, husband, family, wiki, images, biography, twitter, imdb |  National film awards, Best actress award, Actresses

ఇక శ్రీనివాసరావు కూడా ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ బంధువు. ఆయన దగ్గర చాలా కాలం అంటూ ఆయన సినిమాలు వ్యవహారాలను ఎక్కువగా చూసుకునేవారట. అయితే తనతో పాటు తన భర్త కూడా పిల్లలు అంటే చాలా ఇష్టం అని చెప్పిన విజయశాంతి..ఉద్యమం, పార్టీలంటూ మొదలుపెట్టిన తర్వాత అసలు ఆ విషయాన్ని మర్చిపోయిందని తెలియజేసింది.ఇక అప్పటినుంచి తనకు ప్రజలే పిల్లలని తెలియజేసింది.ఒకవేళ పిల్లలు పుడితే తాను వాళ్ల కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి వస్తుందని తెలియజేసింది. దాంతో స్వార్థం పెరిగిపోయి పిల్లల్ని వద్దనుకున్నారని సంచలన విషయాలను తెలిపింది విజయశాంతి.