‘ఇంచార్జ్‌’ని మార్చితే కష్టమే..!

ప్రతి నియోజకవర్గంపై పట్టు సాధించడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకెళుతున్నారు..గత ఎన్నికల మాదిరిగా ఘోరమైన ఓటమి మళ్ళీ రాకుండా..ఈ సారి ఖచ్చితంగా గెలవాలనే కసితో బాబు పనిచేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే..ఇప్పటి నుంచే అసెంబ్లీ స్థానాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వన్ టూ వన్ అంటూ…కేవలం నియోజకవర్గ ఇంచార్జ్‌తో బాబు భేటీ అయ్యి, నియోజకవర్గంలోని పరిస్తితులని తెలుసుకుంటున్నారు.

అలాగే తన దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా ఇంచార్జ్‌లకు వివరించి..ఇంకా జాగ్రత్తగా పనిచేయాలని చెబుతున్నారు. అయితే ఇప్పటికే సగం మందిపైనే నేతలతో బాబు భేటీ అయ్యారు. కానీ ఈ భేటీల్లో ఏ ఇంచార్జ్‌పై కూడా బాబు చర్యలు తీసుకోలేదు. కొందరు ఇంచార్జ్‌ల పనితీరు అంతంత మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి వారిపై బాబు చర్యలు తీసుకుంటారని, వారిని తప్పించి కొత్తవారికి ఛాన్స్ ఇస్తారని అంతా భావించారు. కానీ అదేం జరగలేదు. ఎవరిని పక్కన పెడుతున్నట్లు చెప్పలేదు. పైగా కొందరికి సీటు కూడా ఇస్తున్నట్లు చెబుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇక్కడ బాబు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది..ఇప్పుడే ఎవరిని పక్కన పెట్టకుండా..ఇంకా కాస్త సమయం ఇచ్చి..అప్పుడు కూడా సరిగ్గా పనిచేయకపోతే..అప్పుడు ఇంచార్జ్‌లని సైడ్ చేస్తారని తెలుస్తోంది. ఈ మధ్య కొత్తగా కొందరు ఇంచార్జ్‌లు వచ్చారు. వారిని అప్పుడే పీకేయడం కూడా కరెక్ట్ కాదు. అందుకే బాబు కాస్త వారికి సమయం ఇచ్చి చూస్తారని తెలుస్తోంది.

ఇప్పుడున్న ఇంచార్జ్‌ల అందరికీ సీట్లు ఇవ్వడం అనేది జరిగే పని కాదని మాత్రం క్లియర్‌గా తెలుస్తోంది. కాకపోతే ఇక్కడొక చిక్కు ఉంది. ఇప్పుడు కొందరు ఇంచార్జ్‌లు బాగా కష్టపడి పనిచేస్తున్నారు..కానీ సడన్‌గా వారిని తప్పించి వేరే వారికి సీటు ఇస్తే అసలుకే మోసం వస్తుంది. ఉదాహరణకు గుడివాడలో ఇంచార్జ్‌గా రావి వెంకటేశ్వరరావు యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. కానీ ఆయనకు సీటు డౌట్. తీరా కష్టపడి పనిచేస్తే సీటు ఇవ్వకపోతే ఆ నాయకుడుకు ఇబ్బంది అవుతుంది. అది కూడా టీడీపీకి పరోక్షంగా నష్టం చేసే అవకాశం కూడా ఉంది.