మంత్రుల తెలివి..జగన్‌కే డేంజర్ ?

ఏపీలో మంత్రులు…తమ తమ శాఖలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియడం లేదు గాని…ప్రతిరోజూ మీడియా ముందుకొచ్చి…చంద్రబాబు, పవన్‌లపై విమర్శలు చేయడం మాత్రం తెలుస్తోంది. మంత్రులు అంటే ప్రతిపక్ష నాయకులని తిట్టడానికే ఉన్నారా? అనే డౌట్ వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇటీవల కాలంలో మంత్రులు టార్గెట్ కేవలం..టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోకూడదనే కాన్సెప్ట్‌లోనే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకుండా చేయడానికి బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే కొందరు మంత్రులు ప్రత్యేకంగా పవన్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా…ఇలా కొందరు మంత్రులు చంద్రబాబుతో పవన్‌ని గట్టిగా టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. ఈ మధ్య పవన్…వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని, వైసీపీ విముక్త ఏపీగా చేస్తామని మాట్లాడుతున్నారు.

దీనిపై వైసీపీ మంత్రులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు…పవన్..ఓ వీకెండ్ పొలిటీషియన్ అని, పవన్ శిఖండి మాదిరిగా రాజకీయాలు చేస్తున్నారని మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు, నాదెండ్ల మనోహర్‌లతో కలిసి పవన్…జగన్‌కు వెన్నుపోటు పొడవలని చూస్తున్నారని, ఎవరెన్ని చేసిన జగన్‌ని ఎవరు ఏం చేయలేరని అన్నారు. పవన్ విముక్త ఏపీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, దమ్ముంటే 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే దమ్ము పవన్‌కు ఉందా అని మంత్రులు ప్రశ్నిస్తున్నారు.

ఇలా పదే పదే అన్నీ స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? అని ప్రశ్నించడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. అలా పవన్‌ని రెచ్చగొడితే అన్నీ స్థానాల్లో పోటీ చేస్తారని అప్పుడు ఓట్లు చీలిపోయి తమకు లబ్ది చేకూరుతుందనేది వైసీపీ ప్లాన్‌గా ఉంది. అంటే టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకౌకుండా చేయాలని చూస్తున్నారు. చంద్రబాబుతో గాని పవన్ కలిస్తే…జగన్‌ డేంజర్ జోన్ లో పడినట్లే. అందుకే మంత్రులు తెలివిగా పవన్‌ని రెచ్చగొట్టి టీడీపీతో పొత్తు లేకుండా చేసేందుకు కష్టపడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.