కొడాలి లాజిక్: తారక్‌తో జగన్‌కే ప్లస్?

గత మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా-సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ భేటీ చుట్టూ రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ భేటీపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కేవలం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటన నచ్చి…ఎన్టీఆర్‌ని షా అభినందించడానికే భేటీ అయ్యారని బీజేపీ, టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రామ్ చరణ్ కూడా ఉన్నారు…అలాగే దర్శకుడు రాజమౌళి ఉన్నారు..మరి వాళ్ళని ఎందుక ప్రశంసించలేదని టీఆర్ఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

బీజేపీ ఎవరి మద్ధతు తీసుకున్న తెలంగాణలో తమదే గెలుపు అని అంటున్నాయి. ఇక ఎన్టీఆర్‌తో మద్ధతుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలని బీజేపీ భావిస్తుందని కొడాలి నాని అంటున్నారు. ఏ ప్రయోజనం లేకుండా మోడీ-షాలు ఏది చేయరని, ఎన్టీఆర్‌తో భేటీ వెనుక రాజకీయ కోణం ఉందని అంటున్నారు. అలాగే చంద్రబాబు దగ్గర నుంచి ఎన్టీఆర్ టీడీపీని తీసుకునే ఛాన్స్ ఉందని అన్నారు.

అయితే ఇదే క్రమంలో టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ తీసుకుంటే.. వైసీపీని వదిలేసి…టీడీపీలోకి వస్తారా? అని కొడాలి నానికి మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే కొడాలి దీనిపై వివరణ ఇస్తూ..కట్టే కాలే వరకు తన ప్రయాణం జగన్‌తోనే అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వ స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ను తొలగించి ఆ స్థానంలోకి జూనియర్ ఎన్టీఆర్‌ వచ్చినా… తమపై పెద్దగా ప్రభావం ఉండదని, తమ ఓటు బ్యాంక్ ఇంకా పెరిగే అవకాశం ఉందని కొడాలి అంటున్నారు.

అంటే టీడీపీలో చంద్రబాబు, ఎన్టీఆర్ గ్రూపులుగా విడిపోయి…అప్పుడు ఆటోమేటిక్‌గా వైసీపీకే బెనిఫిట్ అవుతుందనే కోణంలో కొడాలి మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో ఎన్టీఆర్ ఇప్పటిలో రాజకీయాల్లోకి రావడం కష్టం…అంతకుమించి టీడీపీని లాక్కోవడం చాలా కష్టమైన పని. ఒకవేళ టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేతుల్లోకి వస్తే కొడాలి వైసీపీలో ఉంటానని చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారనేది డౌట్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.