షా ఎఫెక్ట్: తారక్ కోసం బాబు..?

ఏదేమైనా గాని కేంద్ర మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అవ్వడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణకు వచ్చిన అమిత్ షా అనూహ్యంగా తన షెడ్యూల్‌ని మార్చుకుని ఎన్టీఆర్‌తో భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. మునుగోడు సభకు వెళ్లకముందే…ఎన్టీఆర్‌ని డిన్నర్‌కు ఆహ్వానించారనే వార్తా….మీడియాలో హల్చల్ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యి…అమిత్ షా…ఎన్టీఆర్‌తో భేటీ అవ్వాలని డిసైడ్ అయ్యారని కథనాలు వచ్చాయి.

అదే సమయంలో రాజకీయ పరమైన కారణాలు కూడా ఉండొచ్చని ప్రచారం జరిగింది. అయితే మునుగోడు సభ తర్వాత హైదరాబాద్ కు వచ్చిన షా…నోవాటెల్ హోటల్‌లో ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. కాసేపు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకోగా, తర్వాత డిన్నర్ చేశారు. అయితే అమిత్ షా, ఎన్టీఆర్ కేవలం సినిమా గురించే మాట్లాడుకున్నారా? లేక రాజకీయాల గురించి ఏమన్నా మాట్లాడుకున్నారా? అనే అంశం ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

ఎంత కాదు అనుకున్న ఈ భేటీలో రాజకీయ కోణం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ చుట్టూ ఎప్పుడు రాజకీయం తిరుగుతూనే ఉంటుంది…ఇప్పటికే ఆయనకు టీడీపీ పగ్గాలు అప్పజెప్పాలని డిమాండ్ పెరిగింది. ఇక తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ గట్టిగా కష్టపడుతుంది. అటు ఏపీలో కూడా బలపడాలని చూస్తుంది. ఇలాంటి తరుణంలో షా…ఎన్టీఆర్‌తో భేటీ అవ్వడం వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉండే ఉంటుందని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

తెలంగాణలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువే…పైగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏపీ నుంచి వచ్చిన వారు ఎక్కువ. ఎలాగో బీజేపీకి పవన్ సపోర్ట్ ఉంది…ఇక ఎన్టీఆర్ లాంటి వారి మద్ధతు దక్కితే…ఇంకా తెలంగాణలో పాగా వేసే అవకాశాలు బీజేపీకి పెరుగుతాయనీ విశ్లేషణలు వస్తున్నాయి. అయితే ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ కావడం టీడీపీ వర్గాల్లో బాగా చర్చనీయాంశమైంది. దేశ రాజకీయాలని శాసించే షానే తారక్‌తో భేటీ అయినప్పుడు…చంద్రబాబు కూడా ఎన్టీఆర్‌ని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తే బెటర్ అని కొందరు తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్‌ని దగ్గర చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో లాభం జరుగుతుందని అంటున్నారు. మరి చూడాలి బాబు సైతం….ఎన్టీఆర్‌ని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తారో లేదో.