ఆమెకు నాలుగోది..అతనికి రెండోది.. అయినా మళ్లీ పెళ్లి..!!

హాలీవుడ్ స్టార్ బెన్ అఫ్లెక్‌, జెన్నిఫర్‌ లోపెజ్‌ తాజాగా వివాహం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు అదేంటి మళ్లీ పెళ్లి అంటూ తమ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు నిజానికి వీరికి జూలైలోనే రహస్యంగా వివాహం జరిగింది కానీ ఇప్పుడు అందరి సమక్షంలో మరొకసారి ఉంగరాలు మార్చుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఈ జంట. శనివారం జార్జియాలోని బెన్ నివాసంలో వీరి వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగినట్లు తెలుస్తోంది. అయితే వివాహం కావడానికి ఒక రోజు ముందు అతని తల్లి క్రిష్ యానే ఇంట్లో కింద పడడం జరిగింది. దీంతో ఆమెను వెంటనే దగ్గరలో ఉన్న వైద్యశాలకు తీసుకువెళ్లి చికిత్స చేయించగా వారు అనంతరం వీల్ చైర్ లో డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇక ఇదే స్థితిలో పెళ్లికి హాజరైన ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.Jennifer Lopez and Ben Affleck get away from each other three weeks after  their marriage | Marca

ఇక 2001వ సంవత్సరంలో గిగ్లి చిత్రం షూటింగ్ సెట్ లో బెన్‌ అఫ్లెక్‌, జెన్నిఫర్‌ లోపెజ్‌ మధ్య ప్రేమ చిగురించింది ఆ తర్వాత సంవత్సరమే వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వివాహం మాత్రం వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి 2004వ సంవత్సరంలో వివాహం చేసుకోలేదని ప్రకటించుకున్నారు. మళ్లీ 2021లో వీరి మధ్య ప్రేమ చిగురించి ఈసారి దాన్ని పెళ్లి వరకు తీసుకువచ్చారు.. వీరి పెళ్లికి సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు .. అంతేకాకుండ జెన్నిఫర్‌ లోపెజ్‌ మాజీ భర్త వారి సంతానం అలాగే..బెన్‌ మాజీ భార్య తన పిల్లలు కూడా హాజరయ్యారు.

ఇకపోతే హీరో బెన్‌ అఫ్లెక్‌ భార్య పేరు జెన్నిఫర్ గార్నర్.. ఇక వీరికి వయోలెట్, సెరాఫినా, సామ్యూల్ అని ముగ్గురు పిల్లలు కలరు . 2018 లో గార్నర్ తో తెగ తెంపులు చేసుకున్న బెన్ ఆ తర్వాత లిండేసే, ఘాకస్, అనడే ఆర్మోస్ లతో డేటింగ్ చేశారు. ఇక గాయని నటి అయిన జెన్నీఫర్ విషయానికి వస్తే.. ఈమె గతంలో ఓజానీ నోవాను వివాహం చేసుకోగా ఆ తర్వాత విడిపోయారు. మళ్లీ ఆ తర్వాత క్రిష్ జుడ్ ని వివాహం చేసుకొని విడిపోయారు. మళ్లీ ఆ తర్వాత సింగర్ మార్క్ ఆంటోని వివాహం చేసుకొని ఎమ్మి, మాక్స్ అనే కవలలు జన్మించారు. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు నాలుగో సారి ఆమె వివాహం బంధం లోకి అడుగుపెట్టింది అతను మాత్రం రెండవ వివాహ బంధంలోకి అడుగు పెట్టారని చెప్పవచ్చు. నిజానికి వీరు చేస్తున్న పని చూసి అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా వివాహ బంధానికి విలువ లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.