యువగళం పాదయాత్రకు బ్రేక్… జగన్‌కు కావాల్సింది ఇదేనా…..!

యువగళం పేరుతో 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో మొదలైన ఈ పాదయాత్ర ఇప్పటికే రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు దాటి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. తొలి రోజుల్లో కాస్త చప్పగా సాగిన పాదయాత్ర…. ఇప్పుడు మాత్రం జోరుగా సాగుతోంది. 200 రోజులు పూర్తి […]

టీడీపీ క్యాడర్‌కు ఏమైంది… మరీ ఇలానా…!

40 ఏళ్ల పార్టీ… దేశ రాజకీయాలనే చక్రం తిప్పిన అధినేతలు… దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నేతలు… తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన అధినేత… పైగా ఎన్నికల సమయం… ఇలా ఇన్ని ప్రత్యేకతలున్నప్పటికీ… టీడీపీ నేతల్లో మాత్రం ఇంకా భయం పోయినట్లు కనిపించడం లేదు. మా వాళ్లు ఉత్త వెధవాయిలోయ్… అన్న గిరీశం డైలాగ్ ప్రస్తుతం టీడీపీ నేతలు, కార్యకర్తలకు సరిగ్గా సరిపోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని […]

టీడీపీలో బీసీ ఎంపీలు ఎక్కువే… కొత్త ముఖాల లిస్ట్ ఇదే…!

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల విషయంలో చకచక నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీ అధినేత చంద్రబాబు అటు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టి సారిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికలలో శ్రీకాకుళం – విజయవాడ – గుంటూరు ఎంపీలు మాత్రమే దక్కాయి. ఈ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలలో కేశినేని నాని, గల్లా జయదేవ్ ఈసారి పోటీ చేస్తారా చేయరా అన్న సందేహాలు ఉండనే ఉన్నాయి. […]

లోకేష్ యువగళం టీడీపీకి కలిసిరావడం లేదా?

200 రోజులు..దాదాపు 2700 కిలోమీటర్లు పైనే లోకేష్ పాదయాత్ర చేశారు..రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు..నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. పోలవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర నడుస్తోంది. ఇక్కడే 200 రోజులు పూర్తి చేసుకున్నారు. మరి ఈ 200 రోజుల పాదయాత్రతో టి‌డి‌పికి ఏమైనా కలిసొచ్చిందా? అంటే పెద్దగా కలిసి రాలేదనే చెప్పవచ్చు. ఎందుకంటే లోకేష్ పాదయాత్ర మొదట అనుకున్న విధంగా విజయవంతంగా కొనసాగలేదు. […]

లోకేశ్ పాదయాత్రలో భారీ మార్పులు… ఎందుకనీ…!?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఇప్పటికే 2,500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మొదలైన యువగళం పాదయాత్ర… 6 జిల్లాలు పూర్తి చేసుకుని 7వ జిల్లాలో కొనసాగుతోంది. అయితే అనూహ్యంగా పాదయాత్ర రూట్ మ్యాప్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వరకు ఒకలా సాగిన పాదయాత్ర… ప్రకాశం జిల్లా నుంచి మారినట్లుగా తెలుస్తోంది. చిత్తూరు, అనంతపురం, […]

మంగళగిరి టూ మంగళగిరి.. ఊహించని మార్పు..!

పాదయాత్ర ఓ నాయకుడిలో ఇంత మార్పు తెస్తుందా..? గతానికి భిన్నంగా మనిషిని పూర్తిగా మార్చేస్తుందా..? నాయకత్వ లక్షణాలను అబ్బేలా చేస్తుందా..? నారా లోకేష్‌ పాదయాత్ర జరిగిన తీరు.. ఆయనకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. సరిగ్గా 188 రోజుల క్రితం లోకేష్‌ పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 2500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మంగళగిరి అసెంబ్లీలో పూర్తి స్థాయిలో పర్యటనలు.. గడప గడపకు కార్యక్రమాలు ముగించుకుని పాదయాత్రకు వెళ్లిన లోకేష్‌ మళ్లీ 185 రోజుల తర్వాత […]

సత్తెనపల్లి టీడీపీ ఓ దారికి వచ్చినట్లేనా….!

పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీలో అధిపత్య పోరు నడుస్తోందనేది బహిరంగ రహస్యం. 2014లో అక్కడ పోటీ చేసి గెలిచిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా ఐదేళ్ల పాటు కొనసాగారు. ఆయితే 2019లో మరోసారి పోటీ చేసిన కోడెల శివప్రసాద రావు ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు చేతిలో ఓడారు. ఆ తర్వాత ఏడాదికే ఆయన ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. అయితే నాటి నుంచి సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. అందుకు ప్రధాన కారణం […]

లోకేశ్‌ను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు… అదేలా..!

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఈ ఏడాది జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో మొదలైన పాదయాత్ర… చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు పూర్తి చేసుకుని గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. 2,300 పైగా పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేశ్… అధికార పార్టీ నేతలపై ప్రతి చోట అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తొలి నాళ్లల్లో అంతగా గుర్తింపు రానప్పటికీ… […]

రోజుకో నియోజకవర్గం.. ఇది ఎలా సాధ్యం….!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. వాస్తవానికి నెల్లూరు జిల్లా చేరే వరకు పరిస్థితి ఒకలా ఉన్న పాదయాత్ర… ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత మరోలా మారిపోయిందనే మాట వినిపిస్తోంది. పాదయాత్ర కోసం టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు జరిగిన యాత్రకు భిన్నంగా… భారీ ఫ్లెక్సీలు, కటౌట్‌లతో తమ సత్తా ఏమిటో చూపిస్తున్నారు. అయితే జిల్లాలో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్రపై […]