లోకేష్ యువగళం టీడీపీకి కలిసిరావడం లేదా?

200 రోజులు..దాదాపు 2700 కిలోమీటర్లు పైనే లోకేష్ పాదయాత్ర చేశారు..రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు..నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. పోలవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర నడుస్తోంది. ఇక్కడే 200 రోజులు పూర్తి చేసుకున్నారు. మరి ఈ 200 రోజుల పాదయాత్రతో టి‌డి‌పికి ఏమైనా కలిసొచ్చిందా? అంటే పెద్దగా కలిసి రాలేదనే చెప్పవచ్చు.

ఎందుకంటే లోకేష్ పాదయాత్ర మొదట అనుకున్న విధంగా విజయవంతంగా కొనసాగలేదు. కేవలం టి‌డి‌పి కార్యకర్తలే పాదయాత్రలో కనిపించారు. తర్వాత నిదానంగా లోకేష్ ప్రజలతో మమేకమవుతూ వచ్చారు. దీని వల్ల అక్కడకక్కడ ప్రజలు కనిపించారు. అయినా సరే పూర్తి స్థాయిలో ప్రజా మద్ధతు ఏమి దక్కలేదు. ఏదో నాలుగైదు బహిరంగ సభలు తప్ప..లోకేష్ సభలు ఎక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీని బట్టి చూస్తే లోకేష్ పాదయాత్ర అనుకున్న విధంగా విజయవంతం కాలేదు. అటు ఆయన ఎక్కడ పాదయాత్ర చేస్తే అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

అక్రమాలు చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. కానీ ఈ ఆరోపణల్లో పస లేదు. ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు. అటు పాదయాత్ర చేసే నియోజకవర్గాల్లో టి‌డి‌పికి పెద్ద ప్లస్ రావడం లేదు. ఏదో కొన్ని నియోజకవర్గాల్లో తప్ప..మెజారిటీ చోట్ల లోకేష్ పాదయాత్ర వల్ల టి‌డి‌పికి ఉపయోగం లేదు.

కాకపోతే వ్యక్తిగతంగా లోకేష్ నాయకుడుగా ఎదిగేందుకు కాస్త కలిసొచ్చిందని చెప్పవచ్చు. అంతే తప్ప..పార్టీ పరంగా ఒరిగిందేమీ లేదు.