మరోసారి రిపీట్ కాబోతున్న ” అర్జున్ రెడ్డి ” కాంబో..

యంగ్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. తరువాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రూపొందిన అర్జున్ రెడ్డి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ మూవీగా రూపొందిన ఈ సినిమా కుర్ర కారుకు బాగా కనెక్ట్ అయింది. సినిమాతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్‌తో దూసుకెళ్తున్నాడు.

No Censor for Arjun Reddy there!

హిట్లు , ఫ్లాపులతో సంబంధం లేకుండా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ తాజాగా సమంత హీరోయిన్గా శివ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ఖుషి మూవీలో నటించాడు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కింది. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి.

Confirmed: Sandeep Reddy Vanga's next with Vijay Devarakonda

అందులో భాగంగా నిన్న మూవీ ప్రమోషన్స్ లో జరిగిన.. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో మైత్రి బ్యానర్ పై విజయ్‌తో మరొక సినిమా నిర్మించాలంటే ఎటువంటి ప్రాజెక్ట్ ఎంచుకుంటారు అంటూ నిర్మాతలకి అభిమాని ఒక ప్రశ్న అడిగాడు. మాకైతే మరోసారి విజయ – సందీప్‌ కాంబోలో గ్రాండ్గా ఓ మంచి సినిమాను నిర్మించాలని ఆశ ఉంది. అన్నీ కలిసి వస్తే తప్పకుండా వీరిద్దరి కాంబినేషన్లో మరో భారీ స్థాయి మూవీ ఉంటుంది అంటూ మైత్రి మూవీ మేకర్స్ అదినేత‌ రవిశంకర్ తెలిపాడు. మరి ఈ హిట్ కాంబోలో కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు ఫైనలైజ్ అవుతుందో చూడాలి.