ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న శ్రీ లీల.. ఓర చూపుతో కుర్రాళ్లపై అందాల వల..

యంగ్ బ్యూటీ శ్రీ లీల.. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తరువాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆమె 7,8 భారీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక్కొక్కటిగా రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.

తాజాగా రామ్ పోతినేని – బోయపాటి డైరెక్షన్లో శ్రీ లీల హీరోయిన్గా రూపొందిన స్కంద మూవీ సెప్టెంబర్ 25 వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ జరిగింది. ఈ ప్రమోషన్స్ లో సందడి చేసిన శ్రీ లీల క్రీమ్‌ కలర్ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో మెరిసింది. తన డ్యాన్స్, నటనతోనే కాకుండా శ్రీ లీల అందం విషయంలోను కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంత‌కు పెంచుకుంటుంది.

ఇక తాజాగా స్కంద ఈవెంట్లో మెరిసిన శ్రీ లీల అదే అవుట్ ఫిట్ తో ఓ ఫోటోషూట్ చేసుకుంది. ఓర చూపుతో రకరకాల స్టిల్స్ ఇస్తూ దిగిన ఆ ఫొటోల‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది శ్రీ లీల. ప్రస్తుతం ఆ పిక్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వజ్రంలో మెరిసిపోతున్నావు శ్రీ లీల అంటూ.. ఓరచూపుతో అందాల వల వేస్తున్నావా అంటూ.. ఇలా అయితే టెంప్ట్ అవ్వకుండా ఉండడం కష్టం అంటూ.. కుర్ర‌కారు కామెంట్స్‌ చేస్తున్నారు.