సైంధవ్ చిత్రంలో విలన్ గా ఆ స్టార్ హీరో..!!

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తనదైన స్టైల్ లో పలు విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నారు. సరికొత్త కథ అంశంతో కూడా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా అవసరమైతే ఇతర భాషలలోని చిత్రాలను డబ్ చేసి మరి తెలుగులో విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు సైతం ఎక్కువగా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు.. ఇటీవలే వెంకటేష్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం సైంధవ కూడా యాక్షన్ చేయమని అన్నట్టుగా తెలుస్తోంది.

Saindhav (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

ఈమధ్య యాక్షన్ సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.. ఇలాంటి కథలకు మంచి డిమాండ్ ఉండడంతో హీరోలంతా ఎక్కువగా యాక్షన్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా కమలహాసన్ విక్రమ్ సినిమాతో రజినీకాంత్ జైలర్ సినిమాతో రాగా ఇప్పుడు వెంకటేష్ కూడా సైంధవ అనే ఒక యాక్షన్ చిత్రంతో రాబోతున్నారు..ఈ చిత్రాన్ని డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తూ ఉండగా చాలామంది ఈ సినిమాల కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా వెంకటేష్ 75వ సినిమాగా విడుదల కాబోతోంది. ఇందులో హీరోయిన్గా రుహాని శర్మ నటిస్తోంది. ఈ సినిమాలో 8 మంది స్టార్స్ నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ ఏడుగురిని పరిచయం చేసిన చిత్రబంధం తాజాగా 8వ పాత్రను కూడా పరిచయం చేయడం జరిగింది. ఇందులో తమిళ స్టార్ హీరో ఆర్య కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. అందుకు సంబంధించి లుక్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది.. అయితే ఈ పోస్టర్లు ఆర్య లుక్ చాలా టేరిఫిక్కుగా కనిపిస్తోంది. ఇందులో ఆర్య పోలీస్ ఆఫీసర్గా లేకపోతే విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా వెంకటేష్ సైంధవ సినిమాతో ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి.