సమంతది ఎంత పెద్ద మనసు.. కోటి ఇచ్చేసిందట..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే గత కొంతకాలంగా సమంత అనారోగ్య కారణంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అమెరికా వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటుంది.

Samantha Ruth Prabhu apologises to Vijay Deverakonda fans: 'Kushi shoot...'  - Hindustan Times

ఇక శివనిర్వాణ‌ దర్శకత్వంలో వచ్చిన ఈ ఖుషి మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ట్రైలర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర ప‌డటంతో విజయ్ దేవరకొండ వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. అయితే హెల్త్ బాలేని కార‌ణంగా సమంత పాల్గొనడం లేదన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ఒప్పుకున్నారంటే ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కు వస్తానని చెప్పి దానికి తగ్గట్లుగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు స్టార్ హీరోయిన్స్.

Samantha calls out doomsday predictions about her health: 'I'm not dead  yet' | The News Minute

అలా సమంత కూడా అగ్రిమెంట్ కు సైన్ చేసిందట. కానీ అనుకొని సంఘటన వల్ల అనారోగ్యంతో ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని కీలక నిర్ణయం తీసుకుంది. సమంత ప్రమోషన్స్ లో పాల్గొనలేని కారణంగా నిర్మాతలకు చాలా నష్టం వచ్చిందని తెలిసి ఆమె తన రెమ్యూనరేషన్ లో కోటి రూపాయలను తిరిగి ఇచ్చేసిందట. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దట్ ఇజ్‌ సమంత అంటూ.. సమంతది ఎంత‌ పెద్ద మనసు అంటూ.. పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.