జగన్‌కు జనం మద్ధతు..పొత్తు ఉన్నా సరే.!

ఏపీలో ప్రజలు మళ్ళీ జగన్ వైపే చూస్తున్నారా? సంక్షేమ పథకాలని అందిస్తూ..అండగా ఉంటున్న జగన్‌కు జనం మళ్ళీ అండగా ఉండాలని అనుకుంటున్నారా? అంటే మెజారిటీ సర్వేలు అవుననే అంటున్నాయి. మళ్ళీ ప్రజలు జగన్‌కే ఓటు వేయాలని చూస్తున్నారు. జగన్‌ని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఇక జగన్‌ని గద్దె దించి అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తున్న చంద్రబాబుకు ఈ సారి కూడా నిరాశ తప్పదని తెలుస్తోంది.

ఆఖరికి పవన్ తో కలిసి పొత్తులో వచ్చిన జగన్‌ని ఓడించడం అసాధ్యమని అంటున్నారు. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజా మద్ధతుకు సంబంధించి కీలక అంశాలని వివరించారు. జగన్‌కు ఏ స్థాయిలో ప్రజా మద్ధతు ఉందో చెప్పారు.  జగన్ పూర్తిగా పాజటివ్ ఓటింగ్ పైనే నమ్మకంతో ఉన్నారని, ప్రస్తుతం 70 శాతం మేర పాజిటివ్ ఓటింగ్ ఉందని, కొంత తగ్గినా 60 శాతం వైసీపీకి పాజిటివ్ ఓటింగ్ ఉందని చెప్పుకొచ్చారు.

ప్రతిపక్షాలు కలిసి పోటీ చేసినా ప్రభావం ఉండదని, అసలు టీడీపీ ప్రభంజనం ఉందని అనుకుంటే పొత్తులు ఎందుకని ప్రశ్నించారు. అంటే లాజికల్‌గా ఓటింగ్ శాతం ఎటువైపు ఉందో సజ్జల క్లారిటీ ఇచ్చేశారు. దీని బట్టి చూస్తే మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పవచ్చు. సజ్జల చెప్పడమనే కాదు..గ్రౌండ్ రియాలిటీ చూస్తే అదే నిజమనిస్తుంది.

మెజారిటీ ఓటింగ్ వైసీపీకే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం పైనే వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. ఈ పరిణామాలు బట్టి చూస్తే మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పవచ్చు.