” స్కంద‌ ” నాన్ థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!!

గత కొంతకాలంగా టాలీవుడ్ లో విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి కొన్ని సినిమాలకు నాన్ థియేట్రికల్ అమ్మకాలు కావడమే చాలా కష్టమైపోతుంది. మరికొన్ని సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ కోట్లలో జరుగుతుంది. ఈ వారం విడుదల కాబోయే ఖుషి సినిమాకి రూ.90 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగగా.. మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న రామ్ – బోయపాటి స్కంద‌ సినిమాకు రూ.98 కోట్ల ఆంధ్ర బిజినెస్ జరిగింది. రామ్ పోతినేని – బోయపాటి శ్రీను కాంబినేషన్లో స్కంద‌ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Nee Chuttu Chuttu (Lyrical Video) | Skanda | Ram Pothineni, Sree Leela | Boyapati Sreenu | Thaman S - YouTube

వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ టీం ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ కట్లో బోయపాటి శ్రీను తన మాస్‌ స్టైల్ ను చూపించాడు. పాన్ ఇండియా లెవెల్ మూవీ కావడంతో ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్‌ ద్వారా నిర్మాత శ్రీనివాస్ చిట్టూరికి మాత్రం గట్టిగా గిట్టుబాటు అయిందట. సుమారు రూ.98 కోట్ల వచ్చాయని తెలుస్తుంది. ఈ మూవీ కి సౌత్ లాంగ్వేజెస్ సాటిలైట్, డిజిటల్ రైట్స్ స్టార్ నెట్వర్క్ గ్రూప్ రూ.54 కోట్ల రూపాయలను దక్కించుకుంది.

Skanda Songs Download 2023 | Skanda Naa Songs Telugu

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వర్షన్స్‌లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. స్టార్ చానల్లో సినిమా టెలికాస్ట్ అవుతుంది. హిందీ వర్షన్ ఓటిటి సాటిలైట్ అండ్, థియేటర్స్ రూ.35 కోట్ల వరకు జరిగిందని ఈ రైట్స్‌ను జి స్టూడియోస్ తీసుకుందని సమాచారం. మరోపక్క ఆడియో రైట్స్‌కు రూ.9 కోట్ల వరకు వచ్చాయి. రిలీజ్‌కి ముందే ఇంత అమౌంట్ రావడం అంటే రికార్డు అనే చెప్పాలి. తెలుగు దియేట్రికల్ రైట్స్ కూడా గట్టిగానే జరిగాయట.

Celebration Song Dummare Dumma From Skanda Is Out | cinejosh.com

థియేటర్స్ నుంచి దాదాపు రూ.50 కోట్ల వరకు వసూలు చేశారు. ఇప్పటికే స్పంద నుంచి 3 సాంగ్స్ రిలీజై ఫస్ట్ రెండు సాంగ్స్ బాగా పాపులారిటీ తెచ్చుకున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన దుమ్మారే దుమ్మా ఫ్యామిలీ బాండింగ్స్ చ‌క్క‌గా రూపొందించారు. రామ్ సరస‌న శ్రీ‌లీలా నటించిన ఈ సినిమా లో సయి మంజ్రేక‌ర్‌, శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్, ఇంద్రజా, పృద్వి కీరోల్స్ లో నటించారు.