గుంటూరు కారం సినిమా నుంచి అందుకే తప్పుకున్న పూజా హెగ్డే..!!

టాలీవుడ్ లో త్రివిక్రమ్ కి లక్కీ హీరోయిన్గా పేరుపొందిన పూజా హెగ్డే.. మహేష్ బాబు తో కలిసి గుంటూరు కారం సినిమాలో నటించబోతోందని తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో.. త్రివిక్రమ్ ,పూజ హెగ్డే మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా మెయిన్ హీరోయిన్ గా శ్రీ లీల ను తీసుకోవడంతో పూజా హెగ్డే తప్పుకుందనే వార్తలు కూడా వినిపించాయి.. బాలీవుడ్ లో కూడా పూజ హెగ్డే నటించిన సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి దీంతో ఈమెను అన్ లక్కీ హీరోయిన్గా భావించారు.

Pooja Hegde Opts Out Of Mahesh Babu's Guntur Kaaram?

అలాంటి సమయంలోనే త్రివిక్రమ్ మళ్ళీ పిలిచి పూజా హెగ్డే కి గుంటూరు కారం సినిమాలో అవకాశం ఇచ్చారు.. అయితే ఓ మూడు నెలలు ఇదే ప్రచారం జరిగింది.. ఫైనల్ గా పూజ ప్లేస్ లో మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకోవడం జరిగింది. మహేష్ సినిమా నుంచి ఎందుకు తప్పుకుందో అనే విషయం గురించి అక్కడక్కడ పలు రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా స్నేహితులు చెబుతున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డే కాలికి మేజర్ సర్జరీ జరిగిందని తెలియజేస్తున్నారు.

పూజ హెగ్డే బీస్ట్, రాధే శ్యామ్ చిత్రం షూటింగులో ఈమెకు తీవ్రమైన కాలి నొప్పితో బాధపడిందట. అయితే గత ఏడాది రెండు మూడు నెలలగా కాలికి కట్టుతో నలవలేని పరిస్థితిలో ఉండేదట..ఈ నేపథ్యంలో మధ్యలో నొప్పి తగ్గిన మళ్లీ రావడంతో ఆమెకు డాక్టర్లు సర్జరీకి రిఫరెన్స్ ఇచ్చారట.దీంతో పూజా హెగ్డే సర్జరీ చేసుకున్నందువల్లే పలు ప్రాజెక్టుల నుంచి తప్పుకుందనే ఆమె సన్నిహితులు సైతం తెలియజేస్తున్నారు. అందుకే గుంటూరు కారం సినిమా నుంచి కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది.