టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గౌతమ్ ఘట్టమనేని పుట్టినరోజు సందర్భంగా గౌతమ్ బర్త్డే కు నమ్రత, సితార, మహేష్ స్పెషల్ విషెస్ తెలియజేశారు. వారు గౌతమ్ కు విష్ చేస్తూ వేసిన పోస్ట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక సితార ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. గౌతమ్ అయితే తండ్రిలానే సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటాడు.
View this post on Instagram
ఇక మహేష్ బాబు తన కొడుకుకు బర్త్డే విషెస్ చెబుతూ నా చాంపియన్ 17వ వసంతంలోకి అడుగుపెట్టినందుకు శుభాకాంక్షలు. నువ్వు వేసే ప్రతి అడుగు నీ లక్ష్యానికి మరింత దగ్గర చేయాలి. నువ్వు ఆకాశాన్ని, నక్షత్రాలను కూడా అందుకునే రేంజ్ కు ఎదగాలి. లవ్ యు సో మచ్ అంటూ పోస్ట్ చేశాడు. ఇక తల్లి నమ్రత కూడా గౌతమ్ కి స్పెషల్గా విషెస్ తెలియజేసింది.
View this post on Instagram
హ్యాపీ బర్త్డే జీజీ (గౌతమ్ ఘట్టమనేని ) నువ్వు ఏడాది ఏడాదికి ఎదుగుతున్న కొద్ది మమ్మల్ని గర్వపడేలా చేస్తున్నావ్.. ఇలానే ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. నువ్వు కన్న కలలన్నీ నెరవేరాలి. వచ్చే ఏడాది ఎలాగు నువ్వు మాతో ఉండవు విదేశాలకు వెళ్ళిపోతావు అందుకే ఈ బర్త్డేనే స్పెషల్ గా సెలబ్రేట్ చేస్తాను అంటూ నమ్రత పోస్ట్ చేసింది. అలాగే ముద్దుల చెల్లెలు సితార నువ్వు నాకు ఆధారం, మూలం అన్నయ్య నువ్వే నా ప్రపంచం ఐ లవ్ యు సో మచ్ హ్యాపీ బర్త్డే టూ మై బెస్ట్ బ్రదర్ అంటూ ముద్దుగా పోస్ట్ చేసింది.
View this post on Instagram
ఇక గౌతమ్ ఇటీవల తన టైం ఎంబి ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించడానికి కేటాయించాడు రెయిన్బో హాస్పిటల్ కి వెళ్లి కార్డియాలజీ ఆంకాలజీ వార్డ్ లో ఉన్న పిల్లలతో కాసేపు టైం గడిపాడు వారితో ముచ్చటించిన గౌతం వారి మొహాల్లో నవ్వులు పూయించడం అలా గౌతమ్ చేసిన పనికి నెట్టింటే ప్రశంసల వర్షం కురిసింది