విజ‌య్ దేవ‌ర‌కొండ ఎదుట భారీ టార్గెట్‌.. `ఖుషి` ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలిస్తే షాకే!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ, స‌మంత జంట‌గా న‌టించిన లేటెస్ట్ మూవీ `ఖుషి`. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఖుషి రేపు గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ తో పాటు మేక‌ర్స్ నిర్వ‌హించిన ప్ర‌మోష‌న్స్ తో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జ‌రిగింది. విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌త చిత్రం లైగ‌ర్ దారుణ‌మైన డిజాస్ట‌ర్ అయింది. అయినా కూడా ఖుషి సినిమాకు మంచి బిజినెస్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థ్రియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను రూ. 41 కోట్ల‌కు విక్ర‌యించారు. అలాగే ఓవ‌ర్సీస్ లో రూ. 7 కోట్ల‌కు సినిమా హ‌క్కులు అమ్ముడుపోయాయి.

వ‌ర‌ల్డ్ వైడ్ గా ఖుషి టోట‌ల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 52.50 కోట్లు. అంటే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా క్లీన్ హిట్ గా నిల‌వాలంటే రూ. 53.50 కోట్లు. ఇంత భారీ టార్గెట్ ను విజ‌య్ దేర‌కొండ ఏ మేర‌కు రీచ్ అవుతాడో తెలియాలంటే ఖుషి ఫ‌స్ట్ షో ప‌డే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. కాగా, ఏరియాల వారీగా ఖుషి బిజినెస్ లెక్క‌లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం: 15 కోట్లు
సీడెడ్: 6 కోట్లు
ఆంధ్రా: 20 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ‌= 41 కోట్లు
—————————–

క‌ర్ణాట‌+రెస్టాఫ్ ఇండియా: 4.5 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 7.00 కోట్లు
—————————
టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్‌= 52.50 కోట్లు
—————————