టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్న ‘ కాంతార ‘ బ్యూటీ..

గత ఏడాది ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్గా సంచలనం సృష్టించిన కన్నడ మూవీ కాంతార. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రూ. 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా అనుకోని విధంగా కలెక్షన్ల బీభత్సవం సృష్టించింది. రూ.400 కోట్ల భారీ కలెక్షన్లను రాబట్టింది. కన్నడలోనే కాక తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ ఇలా దాదాపు అన్ని భాషలలో ఈ సినిమా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Kantara: Actress Sapthami Gowda charged Rs 1.25 Crore for her role; here's  how many Crores Rishab Shetty, Kishore and others charged for the  highly-rated action thriller that has crossed Rs 250 crore

కోట్లాదిమంది ప్రేక్షకులకు కనెక్ట్ అయిన ఈ సినిమాల్లో రిషబ్ శెట్టి హీరోగా నటించగా హీరోయిన్గా సప్తమి గౌడ నటించింది. ఈ ఈ సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

Sapthami Gowda: పసుపు చీరలో పైట లేకుండా కాంతార హీరోయిన్..పిక్స్ వైరల్.. ! |  Kantara actress sapthami gowda flaunts her beauty in yellow saree see  photos– News18 Telugu

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ – వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో రాబోతున్న తమ్ముడు మూవీలో హీరోయిన్‌గా కాంతార బ్యూటీ సప్తమి గౌడ నటించబోతుందట. అలాగే సీనియర్ హీరోయిన్ లయ.. నితిన్ కు అక్కగా ఈ సినిమాలో కనిపించబోతుందని న్యూస్ వైరల్ అవుతుంది. ఇక సెప్టెంబర్ 1 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్స్ ప్రారంభమవుతాయి.