మహిళా ఓటుపై ఫోకస్..బాబుని నమ్ముతారా?

మహిళలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది..అందులో ఎలాటి డౌట్ లేదు. మన దేశంలో మహిళా శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక రాజకీయాల్లో వారి ప్రభావం ఏంటి అనేది చెప్పుకోనక్కర్లేదు. వారు తల్చుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి. అందుకే ఏ నాయకుడైన మహిళా ఓటు బ్యాంకుపైనే ఫోకస్ పెడతారు. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మహిళా ఓటు బ్యాంకుపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు.

గత ఎన్నికల్లో మహిళలు జగన్‌కు పెద్ద ఎత్తున మద్ధతు పలికారు. దాంతో వైసీపీకి భారీ గెలుపు దక్కింది. ఇప్పుడు ఆ మహిళలని తమ వైపు తిప్పుకునేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి కీలక హామీలు ఇస్తున్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఆర్టీసీ ప్రయాణం ఉచితం, తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి రూ.15 వేలు, 18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని మేనిఫెస్టో వివరిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళల ఓట్లు టి‌డి‌పికి పడతాయనేది బాబు ప్లాన్.

అయితే మహిళలు ప్రతిదీ గుడ్డిగా నమ్మే పరిస్తితి లేదు. ఎందుకంటే వారికి అన్నీ విషయాలు తెలుసు. 2014లో బాబు అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి..అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. బ్యాంకులో బంగారం రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ముందు చెప్పి హ్యాండ్ ఇచ్చారు.

అవేమీ మరిచిపోరు..అదేవిధంగా జగన్ ఇచ్చిన మాట తప్పకుండా పథకాలు అమలు చేస్తున్నారు. ప్రతి పథకం మహిళకే వస్తుంది. అలాంటప్పుడు మహిళలు..జగన్‌ని నమ్ముతారా? బాబుని నమ్ముతారో? అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ఉపయోగం లేదు.