నాకు డబ్బే ముఖ్యం.. డ‌బ్బు కోస‌మే సినిమాలు చేస్తున్నా.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఓపెన్ కామెంట్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రేపు ఈయ‌న నుంచి `ఖుషి` అనే రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్ గా న‌టించింది. మ‌రికొన్ని గంట‌ల్లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

గ‌త రెండు వారాల నుంచి ఖుషి ప్ర‌మోష‌న్స్ లో విజ‌య్ దేర‌కొండ చాలా బిజీగా ఉన్నాడు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న విజ‌య్.. తాను డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నాను అని కుండబద్దలు కొట్టాడు. `ఏ క‌ష్టం రాకుండా అమ్మనాన్నాలను బాగా చూసుకోవాలి.. వాళ్లకి మంచి లైఫ్ ఇవ్వాలి.. నేను హ్యాపీగా ఉండాలి. మంత్ ఎండ్ వ‌స్తే రెంట్ క‌ట్టాలి, గ్యాస్ సిలేండ‌ర్ వ‌స్తే అకౌంట్ లో డ‌బ్బులు లేవు.. ఇలాంటివి ఇక విన‌కూడ‌ద‌ని డిసైడ్ అయ్యాను.

అందుకే డ‌బ్బు కావాల‌నుకున్నా. నాకు డబ్బే ముఖ్యం.. డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నాను.. అలాగే సమాజంలో రెస్పెక్ట్ కావాలి.. నన్ను ఎవరైనా అవమానిస్తే నేను అస్సలు క్షమించలేను.. డబ్బే అన్నింటికి ప్రధానం.. ధనం మూలం ఇదంజగత్` అంటూ విజ‌య్ దేర‌కొండ వ్యాఖ్యానించాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.