మ‌హేష్ బాబును ఏకేస్తున్న‌ అక్కినేని ఫ్యాన్స్.. ఆమాత్రం జ్ఞానం లేదా అంటూ ఫైర్‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబును చేసిన ఓ ప‌ని అక్కినేని ఫ్యాన్స్ ఆగ్ర‌హానికి కార‌ణం అయింది. దాంతో మ‌హేష్ బాబును సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏకేస్తున్నారు. అసలేం జ‌రిగిందంటే.. ఆగ‌స్టు 29 నాగార్జున త‌న 64వ బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు, అభిమానులు మ‌రియు సినీ ప్రియులు నాగార్జున‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ బాబు కూడా ఓ ట్వీట్ వ‌దిలాడు.

`హ్యాపీ బ‌ర్త్‌డే నాగార్జున‌. విజయం మరియు అంతులేని ఆనందంతో మీరు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను` అంటూ మ‌హేష్ బాబు త‌న ట్వీట్ లో పేర్కొన్నాడు. అయితే `హ్యాపీ బర్త్ డే నాగార్జున` అంటూ ఏకవచనంతో మ‌హేష్ విష్ చేయ‌డం అక్కినేని ఫ్యాన్స్ కు ఏ మాత్రం న‌చ్చ‌లేదు. ఈ క్ర‌మంలోనే మ‌హేష్ బాబుపై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.

నాగార్జున మీకన్నా వ‌య‌సులోనే కాదు నటుడిగానూ సీనియర్.. అలాంటి వ్య‌క్తికి క‌నీస గౌర‌వం ఇవ్వాల‌న్న జ్ఞానం కూడా లేదా అంటూ ఫైర్ అవుతున్నారు. మ‌రికొంద‌రు పేరు పక్కన సార్ లేదా గారు అని పెట్టి మర్యాద ఇస్తే బాగుండేది అంటూ మ‌హేష్ బాబు హ‌త‌వు ప‌లుకున్నారు. మొత్తానికి ఈ మ్యాట‌ర్ పై అక్కినేని ఫ్యాన్స్‌, నాగార్జున్ ఫ్యాన్స్ మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక డిబెట్ మొదలైంది.