వార్ 2 లో తారక్ ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనందరికీ సుపరిచితమే. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నాయి. ఇక ఈ మూవీ అక్టోబర్ 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక మరోవైపు హృతిక్ రోషన్ తో కలిసి యష్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న వార్ 2 మూవీ కూడా చేసేందుకు సిద్ధమయ్యాడు ఎన్టీఆర్.

ఈ మూవీ యొక్క షూట్ ఇప్పటికే ప్రారంభం కాగా.. హృతిక్ పై దర్శకుడు అయాన్ ముఖర్జీ పలు సీన్స్ చిత్రీకరించాడు. ఇక విషయంలోకి వెళితే.. రేపటి నుంచి ఈ మూవీకి సంబంధించిన సెట్స్ లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఇప్పటికే అనేక రూమర్స్ వినిపించాయి.