తన చిట్టి చెల్లికి స్పూన్ తో ఫీడ్ చేస్తూ ఫోటోకు స్టిల్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్.. సెలబ్రిటీ కిడ్.. ఎవరో గుర్తుపట్టారా..?!

సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు త్రో బ్యాక్ థీంతో వైరల్ అవుతూనే ఉంటాయి. వారి అభిమాన హీరో, హీరోయిన్లు, నటీ, నటుల, ఫోటోలను వైరల్ చేయడంలో ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశ‌క్తి చూప్తూ ఉంటారు. అలా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన చైల్డ్ హుడ్ మెమోరీస్ నెట్టింట‌ చెక్కర్లు కొడుతున్నాయి.

అలా ప్రస్తుతం ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పాటు చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ సెలెబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే. బాలీవుడ్ లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ చిన్నది 1998 అక్టోబర్ 30న జన్మించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఛుంకీ పాండే కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆమె త‌ల్లి భావన పాండే ఫ్యాషన్ డిజైనర్.

ఇక అన‌న్య‌ ముంబైలో ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసని పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ.. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ 2019లో కరణ్‌ జోహార్ సినిమా స్టూడెంట్ ఆఫ్‌ది ఇయర్ 2తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది. 2022లో సౌత్ స్టార్‌ విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమాలో నటించి పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకుంది.