వేసవిలో మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటున్నారా?.. అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..!

ప్రస్తుత కాలంలో ఉండే ఉష్ణోగ్రతలు కారణంగా అనేక అనారోగ్య సమస్యలతో పాటు ఆడవాళ్ళ ముఖ సౌందర్యం కూడా దెబ్బతింటుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల చర్మం బాగా దెబ్బతింటు ఉంటుంది. కాసేపు ఎండలో ఉన్న టాన్ పెరుగుతుంది. ఈ సమయంలో సరైన స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అవ్వడంతో మంచి ఫలితాలు పొందవచ్చు.

వేసవిలో చర్మంపై ఎక్కువగా చమట వస్తుంది. చర్మ గ్రంథాల నుంచి అధికంగా నూనె ఉత్పత్తి అవుతుంది. దీంతో చర్మంపై మలినాలు పెరుగుతాయి. వీటిని తొలగించేందుకు రెండుసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి. చర్మం తాలుక అందాన్ని కాపాడుకునేందుకు సరైన స్కిన్ కేర్ ఉపయోగించడం అవసరం. హెర్బల్ ఉత్పక్తులు ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

బ్యూటీ కేర్ రొటీన్ లో ఉపయోగించే సిరంలో యాంటీ ఆక్సిడెంట్స్ విధంగా చూసుకోండి. యాంటీ ఆక్సిడెంట్లు కానాలను ఆరోగ్యంగా మారుస్తాయి. ప్రతిరోజు నిద్రపోవడానికి ముందు ముఖానికి మాయిశ్చరైజర్స్ రాసుకోవాలి. మాయిశ్చరైజర్ విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పైన చెప్పిన టిప్స్ ని ఎండాకాలంలో పాటించి మీ చర్మాన్ని మరింత గ్లోయిగా చేసుకోండి.