సుజిత్ – నాని కాంబోలో రానున్న మూవీ ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా..?!

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న యాంగ్ డైరెక్టర్స్ అంతా వైవిధ్యమైన కధ అంశాలను ఎంచుకుంటూ సినిమాతో సక్సెస్ అందుకోవాలని.. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక్కో దర్శకుడు ఒక్కొక్క వైవిధ్యమైన కథను ఎంచుకుంటూ సక్సెస్ లు అందుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇలాంటి క్రమంలో వాళ్ళు చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకుంటాయో అనే ఆలోచన కూడా ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నానితో యంగ్ డైరెక్టర్ హరీష్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Sujeeth: పవర్ స్టార్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్‌ను మెగా పవర్ స్టార్‌తో  చేస్తున్నాడా..? - Telugu News | Will Director Sujeeth Doing The Remake Of  'Teri' Movie With Ram Charan..? | TV9 Telugu

అయితే హరీష్ ఈ సినిమాను హాలీవుడ్ నుంచి పలు సినిమాల కథలను తీసుకుని వాటన్నిటిని కలిపి ఓ మూవీగా తీస్తున్నాడని.. ఆ సినిమాలన్నిటికీ కాపీగానే నాని సినిమా వస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాని చేయబోయే సినిమా హాలీవుడ్ సినిమాకి కాపీనా అంటూ పలు ట్రోల్స్ ని కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే నాని, సుజిత్ కాంబోలో వస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకుని సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు.

#Nani32 - Announcement Video | NANI | Sujeeth | DVV Danayya

ఇలాంటి క్ర‌మంలో నాని సుజిత్ కాంబోపై హాలీవుడ్ మూవీ కాపీ అంటూ వస్తున్న వార్తలు పై నాని అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కనుక దాదాపు ఈ సినిమా భారీ వసూలు కలెక్ట్ చేయడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు. మొత్తానికి సుజిత్ ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను చేస్తూనే.. మరోపక్క నానితో ఇంకో సినిమాను చేయడం నిజంగా గొప్ప విషయం. ఇప్పటివరకు రెండు సినిమాలు మాత్రమే తీసిన‌ ఈయన ఒకటి శర్వానంద్ రన్ రాజా రన్, మరొకటి ప్రభాస్ సాహో సినిమాలను మాత్రమే రూపొందించాడు.