అన్నగారు ఎన్టీఆర్ కే చెమటలు పట్టించిన ఒక్కే ఒక్క నటుడు ఈయనే.. సినీ ఇండస్ట్రీని షేక్ చేసి పడేశాడుగా..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అంటే అందరూ కళ్ళు మూసుకుని చెప్పే రెండే రెండు పేర్లు ఎన్టీఆర్ – ఏఎన్నార్ . ఈ ఇద్దరు లేకపోతే అసలు సినిమా ఇండస్ట్రీ లేదు అంటూ చాలామంది చెప్పుకొచ్చారు . కాగా రీసెంట్గా వీళ్ళకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . ఎన్టీఆర్ అంటే అందరికీ భయం .. చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు చాలా చాలా కఠినంగా ఉంటాడు . తన మాట వినకపోయినా .. తాను అనుకున్న పని జరగకపోయినా చాలా చాలా కోప్పడిపోతారు. అందుకే ఆయనతో వర్క్ చేసే డైరెక్టర్ మేకర్స్ చాలా చాలా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని సీన్స్ రాస్తూ ఉంటారు .

అయితే ఎన్టీఆర్ కూడా అంతే స్ట్రిక్ట్ గా తానుపెట్టుకున్న రూల్స్ ని ఫాలో అవుతాడు. షూట్ కి టయానికి రావడం .. షూట్ లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఎటువంటి పాత్రనైనా ఎటువంటి డైలాగ్స్ అయిన అవలీలగా సింగిల్ టేక్ లో చెప్పే సత్తా ఉన్న నటుడు ఎన్టీఆర్ . అలాంటి నటుడు కూడా భయపెట్టిన ఏకైక నటుడు ఎస్.వి.రంగారావు . ఈ విషయం అప్పట్లో బాగా ట్రెండ్ అయింది . బాగా వైరల్ గా కూడా మాడింది. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ భయపడేది ఒకే ఒక్క యాక్టర్ ఎస్విఆర్ కి అంటూ అప్పట్లో జనాలు చెప్పుకునేవారు. అంతేకాదు ఇద్దరికీ పెద్దగా పడేది కాదు అంటూ కూడా ప్రచారం జరిగేది.

అయితే అది హెల్తీ రిలేషన్షిప్ .. ఒక నటనపరంగా నువ్వా నేనా అంటూ పోటాపోటీగా నటించేవారట . ఎన్టీఆర్ సినిమాలంటే జనాలకి విపరీతమైన పిచ్చి . అంతే కాదు ఎన్టీఆర్ ని మించిన స్థాయిలో పేరు సంపాదించుకోవడానికి ఎస్వీఆర్ చాలా చాలా కష్టపడ్డారట. అంతేకాదు వీళ్ళు కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . వర్క్ పరంగా హెల్తి కాంపిటీషన్ తీసుకొచ్చారు ఎన్టీఆర్ ఎస్వీ రంగారావు గారు.

ఎన్టీఆర్ తన ప్రొడక్షన్లో రూపొందించిన సినిమా ఉమ్మడి కుటుంబం. ఆ మూవీకి నాగభూషణం నటించిన జమిందార్ పాత్రకి మొదట ఎస్ వీ ఆర్ ని అనుకున్నారట . అయితే ప్రొడక్షన్ పరంగా కొన్ని రూల్స్ ఉండడంతో కాల్ షీట్స్ అగ్రిమెంట్లు ఉంటాయి ..వాటికి సైన్ చేయమంటే ఎస్వీఆర్ చేయలేదట.. అడ్జస్ట్ చేసుకుందాం జస్ట్ పద్ధతి ప్రకారం వెళ్దాం అంటే.. నేను ఆ రూల్ ఫాలో కాను అంటూ మొండికేసారట. అంతేకాదు ఎన్టీఆర్ కూడా ఆ విషయంలో తగ్గేదే లేదు అంటూ ముందుకు వెళ్లారట. అంతేనా ఆ సినిమా నుంచి తప్పుకునే స్థాయికి వచ్చేసాడు ఎస్విఆర్ . అంతేకాదు అడ్వాన్స్ కూడా తెల్లారి రివర్స్ ఇచ్చి పంపించాడట. పంతానికి పోతే ఎస్వీఆర్ ఎవరి మాట వినేవాడు కాదు అని చెప్పడానికి ఇదే ది బెస్ట్ ఎగ్జాంపుల్..!