ఇక బాక్సులు బద్ధలైపోవాల్సిందే.. దేవర సినిమాలో ఐటెం సాంగ్ ను ఓకే చేసిన గ్లోబల్ సెక్సీ ఫిగర్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న దేవర సినిమాలో స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా ..? అంటే అవును అన్న ప్రచారమే ఎక్కువగా జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ వార్త ఓ రేంజ్ లో వైరల్గా మారింది . కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వికపూర్ హీరోయిన్గా నటిస్తున్న సినిమా దేవర . ఇప్పటికే రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మూడో షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది . ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నాడు.

అంతేకాదు ఈ సినిమాలో చాలా చాలా సస్పెన్స్ లో ఉంటాయి అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . ఎన్టీఆర్ ఈ సినిమాలో నటన పరంగా కుమ్మి పడేశాడు అంటూ మేకర్స్ కూడా చెప్పేస్తున్నారు. రిలీజ్ అయిన క్లిప్స్ – పోస్టర్స్ ఆధారంగా సినిమా ఏ రేంజ్ లో హిట్ అవ్వబోతుందో అర్థం చేసుకోవచ్చు . కాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటపడింది . ఈ సినిమాలో హాట్ బ్యూటీ పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేయడానికి ఓకే చేసిందట . నిజానికి ఈ సినిమాలో ఎవరైనా బాలీవుడ్ బ్యూటీని ఐటమ్ సాంగ్ కోసం రంగంలోకి దించాలనుకున్నారట.

కానీ పాట లిరిక్స్ ప్రకారం పూజ హెగ్డే అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది అని రంగస్థలం సినిమాలో జిగేలురాణి సాంగ్ లాగే ఈ పాట కూడా ఉండబోతుంది అని ..అందుకే కొత్త బ్యూటీలతో రిస్క్ చేయడం కన్నా పూజా హెగ్డే తో ఈ పాట చేయిస్తే సినిమాకి మరింత హైప్ క్రేజ్ వస్తుందని భావించారట మేకర్స్. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోకపోయినా గ్లోబల్ బ్యూటీస్ కి మించిపోయే రేంజ్ లోనే సెక్సీ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది పూజ హెగ్డే ..ఆ విషయంలో సందేహమే లేదు . అందుకే కుర్రాళ్ళు కూడా ఈ కాంబో ని బాగా ఇష్టపడుతున్నారు. కనీసం ఈ కాంబోతోనైనా పూజ హిట్టు పడుతుందేమో చూడాలి . గతంలో ఎన్టీఆర్ సరసన అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే..!!