ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన క్లారిటీ తాజాగా వెలువడింది. సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్‌తో స్పీరిట్ సినిమా షూటింగ్ సంబంధించిన విషయాలతో పాటు సలార్ 2 షూటింగ్.. మిగిలిన ప్రాజెక్టులు ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి అనే వివరాలు తెలిసాయి. చేతిలో ఇప్పటికే నాలుగు సినిమాలు ఉన్నా.. పార్ట్2లు రావడంతో మరింత బిజీ లైనప్ ఏర్పరచుకున్నాడు ప్రభాస్. త్వరలో డార్లింగ్ కల్కి 2898 ఏడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ పై ప్రస్తుతం ఊగిసలాట జరుగుతుంది. అయితే దీనిపై మేకర్స్ స్పందించలేదు.
ఎలాంటి క్లారిటీ రాలేదు. అదిగో అప్డేట్.. ఇదిగో అప్డేట్.. అన్ని ఫ్యాన్స్ పోస్ట్లు వైరల్ చేయడం తప్ప.. టీం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. సాధారణంగా మే9న సినిమా రిలీజ్ అని ప్రకటించారు. అయితే ఎన్నికలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే కావడంతో.. సినిమా వాయిదా పడుతుందని.. మే 30 నుంచి జూన్ మొదటి వారంలో సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. అయితే దీనిపై టీం స్పందిస్తే కానీ క్లారిటీ రాదు. ఇక ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. నెక్స్ట్ మూవీ షూటింగ్ మొదలయ్యేలోపు ఈ సినిమాను పూర్తి చేసేయాలని లక్ష్యంతో ప్రభాస్ నటిస్తున్నాడు.
ఇటీవల సినిమాకు సంబంధించిన ఓ లుక్ వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తాజాగా స్పిరిట్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ సందీప్ రెడ్డి వంగ ప్రకటించారు. యానిమల్ తర్వాత సందీప్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సందీప్ దీనిపైనే పనిచేస్తున్నారు. అయితే ఈ మూవీ త్వరలోనే ప్రారంభమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై రియాక్ట్ అయిన సందీప్ ఈ ఏడాది ద్వితీయార్థంలో షూట్ ప్రారంభమవుతుందని వివరించారు.
అయితే సలార్2 షూటింగ్ కూడా త్వరలోనే ఉండనుంది అంటూ వార్తలు వైరల్ అవ్వడంతో.. ఎప్పుడూ ఏ సినిమా షూట్ ఉంటుందనేది ప్రేక్షకుల్లో సస్పెన్స్ గా మారింది. తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మాటలతో దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ ఏడాది చివర్లో స్పిరిట్ సినిమా ప్రారంభం కానుందని ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించరున్నారని.. డిసెంబర్ నుంచి స్పిరిట్ ని సెట్స్ పైకి తీసుకు వస్తున్నట్లు వివరించారు. ఇందులో ప్రభాస్ లుక్ చాలా కొత్తగా ఉండబోతుందట. ఇప్పటివరకు చూడని నయా లుక్ లో డార్లింగ్ ఆకట్టుకుంటాడని తెలుస్తోంది.