‘ మ్యాడ్ ‘ మూవీ అభిమానులకు గుడ్ న్యూస్.. రెట్టింపు నవ్వులతో సీక్వెల్..!!

ప్రస్తుతం సీక్వెల హవా భారీగా నడుస్తుంది. ఇటీవల టిల్లు స్క్వేర్‌ సినిమా వచ్చి భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా సక్సెస్ అందుకోవడంతో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ విజయాన్ని కొనసాగించేందుకు.. మరో సీక్వెల్లో పట్టాలెక్కించనుంది. గతేడాది అక్టోబర్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మ్యాడ్‌ సినిమాకు సీక్వెల్ గా మాడ్ స్క్వేర్ పేరుతో మరో సినిమాను రూపొందిస్తున్నట్లు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.

ఈ ఉగాది వేడుక‌లలో భాగంగా మ్యాడ్ స్క్వేర్ షూట్ ప్రారంభించారు. తొలి సినిమాలో నటించిన తార‌క్ బావ‌మ‌ర్ధి నార్ని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా మ‌రోసారి క‌లిసి వర్క్ చేయనున్నారు. అయితే హీరోయిన్ల వివరాలు త్వరలోనే వెలుల‌డ‌నున్నాయి. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Mad Square Latest News in Telugu, Mad Square News, Mad Square Online News Live, Mad Square Updates | HITTV Telugu

ఉగాది సందర్భంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సర్వేగంగా జరుగుతోంది. మొద‌టి పార్ట్ క‌డుపుబా న‌వ్వించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. అందుదుకు రెట్టింపు జోష్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా.. ఈ సీక్వెల్ రాబోతుందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.