ఈ ప్రపంచంలో ప్రభాస్ కి కోపం తెప్పించే ఏకైక వ్యక్తి అతడే.. ఎవరో చెప్పుకోండి చూద్దాం..!

ప్రభాస్ .. పాన్ ఇండియా హీరో.. ఈశ్వర్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోయాడు. ప్రభాస్ ని జనాలు లైక్ చేయడానికి ఒకే ఒక్క రీజన్ ఆయన మంచితనం ..ఎవ్వరి జోలికి వెళ్లకుండా తన పని తను చూసుకో పోయే హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు . అయితే ఇప్పటికి స్టేజిపై మైక్ పట్టుకొని మాట్లాడడానికి చాలా చాలా సిగ్గుపడుతూ ఉంటాడు ప్రభాస్ . ఆది పురుష్ ఈవెంట్లో స్పీచ్ ఇవ్వడానికి ఎంత సిగ్గుపడ్డాడో మనకు తెలిసిందే.

కాగా ఇదే క్రమంలో ప్రభాస్ కి.. కోపం తెప్పించే ఏకైక వ్యక్తి అతడే అంటూ రాజమౌళి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ప్రభాస్ – రాజమౌళి కాంబినేషన్లో ఫస్ట్ టైం వచ్చిన సినిమా ఛత్రపతి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రికార్డును బ్రేక్ చేసేసింది . సూపర్ డూపర్ హిట్ అయింది . వీళ్ళ కాంబోపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేలా చేసింది . ఈ సినిమా ప్రమోషన్ టైం లో రాజమౌళి ప్రభాస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు .

అప్పుడు రాజమౌళి – ప్రభాస్ గురించి చెబుతూ ఈ ప్రపంచంలో ఆయనకు కోపం తెప్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కెమెరా సెంధిల్ మాత్రమే ..ఎందుకంటే ఆయన నా కంటే కూడా బాగా పర్ ఫెక్షనిస్ట్.. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు అని.. ఆర్టిస్టు రెడీ అయ్యే టైంలో కూడా చెక్ చేసుకుంటూ ఉంటాడు అని .. అలాంటివి ప్రభాస్ కి పెద్దగా నచ్చవని కొన్ని కొన్ని సార్లు ప్రభాస్ కోపం కూడా తెచ్చుకుంటాడు అని చెప్పుకొచ్చాడు. ఇదంతా సరదాగా మాట్లాడాడు రాజమౌళి. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ ప్రభాస్ కల్కి సినిమాలో బిజీగా ఉన్నాడు . రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమా కోసం కష్టపడుతున్నాడు..!!