శ్రీదేవి చనిపోవడానికి కర్త-కర్మ-క్రియ ఆయనే.. ఇన్నాళ్లకి వీడిన డెత్ మిస్టరీ..!

శ్రీదేవి .. అతిలోకసుందరి అందాల ముద్దుగుమ్మ ..బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..తెలుగు జనాల డ్రీమ్ గర్ల్ .. ఎన్ని చెప్పుకున్న తక్కువే . అలనాటి అందాల తార శ్రీదేవి గురించి ఇంకా ఇంకా చెప్పాలి అనిపిస్తూ ఉంటుంది . వినే వాళ్ళకి ఇంకొంచెం చెప్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది . అలాంటి ఓ అరుదైన రేర్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకునింది ఈ ముద్దుగుమ్మ . చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఇచ్చిన శ్రీదేవి ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలను చేసిందో మనకు తెలిసిందే. అది క్లాస్ – మాస్ – రొమాంటిక్ ట్రెడిషనల్ ఏ పాత్రైనా సరే ఓ రేంజ్ లో అల్లాడించేస్తాది. తెలుగు లో ఓ ఊపు ఊపేసిన బ్యూటీ అని చెప్పాలి సావిత్రి గారి తర్వాత ఇండస్ట్రీలో అలాంటి స్టార్ స్టేటస్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఏకైక హీరోయిన్ శ్రీదేవి అని చెప్పడంలో సందేహం లేదు .

అయితే అనూహ్య రీతిలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది ..శ్రీదేవి దుబాయిలో తన బంధువుల పెళ్ళికి వెళ్ళిన ఆమె ఓ హోటల్ గదిలో బాత్ డబ్బులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది .ఇది నిజంగా అప్పట్లో అభిమానులకి చాలా చాలా షాకింగ్ అనిపించింది . శ్రీదేవి లాంటి ఓ స్టార్ హీరోయిన్ బాత్రూంలో మరణించడం ఇది నమ్మసక్యంగా లేదు .. ఎవరో కావాలని ఆమెను మర్డర్ చేశారు అంటూ కామెంట్ చేశారు . ఒకానొక సమయంలో ఆమె చనిపోవడానికి కారణం భర్త బోనీకపూరే అంటూ ప్రచారం చేశారు . భర్త బోనికపూర్ శ్రీదేవి మరణానికి కర్త కర్మ క్రియ అంటూ చాలా చాలా ట్రోల్ చేశారు . అయితే ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోని బాలీవుడ్ ఇండస్ట్రీ మెల్లమెల్లగా శ్రీదేవిని మర్చిపోతూ బోనీ కపూర్ ని చూసుకుంటూ ముందుకెళ్ళిపోయింది .

రీసెంట్ గా సోషల్ మీడియాలో శ్రీదేవి మరణానికి కారణం అదే అంటూ ప్రచారం జరుగుతుంది . శ్రీదేవికి చిన్న టైంలో చిన్ననాటి టైంలోనే తన జాతకంలో జలగండం ఉంది అంటూ జ్యోతిష్కులు చెప్పారట . దానివల్ల ఈమె మరణించింది అంటూ మళ్ళీ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఓ గండం నుంచి బయటపడిందట . అప్పుడే ఆమె చనిపోవాల్సింది అని .. కానీ షూటింగ్ సిబ్బంది కాపాడడంతో ఆమె చచ్చి బతికింది అని.. ఆ జలగండం కారణంగానే శ్రీదేవి మరణించింది అంటూ ప్రచారం చేస్తున్నారు . ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ – బాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది..!!