వామ్మో.. ఇదేం ఆచారం.. వృద్ధురాలు సెల్ఫీ అడిగితే ఈ హీరో ఏం చేశాడో చూడండి..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో.. సోషల్ మీడియాలో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో పైకి ఎదిగిన హీరోలు చాలా చాలా తక్కువ . వాళ్లలో ఒకరే విజయ్ సేతుపతి . టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ అంటూ భాషా బేధం లేకుండా అన్ని భాషలలో ముందుకు వెళుతూ వస్తున్నాడు. కేవలం హీరో గానే కాదు ఎటువంటి పాత్రలనైనా సరే అవలీలగా నటించే గలిగే సత్తా ఉన్న టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి . క్యారెక్టర్ డిమాండ్ చేయాలి కానీ చీర కట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాడు .నిజంగా ఆ విషయంలో విజయ్ సేతుపతికి హాట్సాఫ్ చెప్పాల్సిందే.

తాజాగా ఈయనకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది . తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే . ఉదయం స్టార్ట్ అయిన ఎన్నికలు సాయంత్రం వరకు ప్రశాంతంగా జరిగాయి . ఓటు వేసేందుకు కోలీవుడ్ స్టార్ట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు . ఈ క్రమంలోనే కొలివుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చారు . అంతే అక్కడ ఉండే వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ అంటూ ఎగబడ్డారు. అయితే వీల్ చైర్ లో నడవలేని ఓ వృద్ధురాలు అతనిని చూసి సెల్ఫీ అడిగింది . వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె కాళ్లకు నమస్కారం పెట్టి కిందకి కూర్చొని మరి ఆమెతో సెల్ఫీ దిగాడు .

ఆయన ప్రవర్తన చూసి అక్కడ ఉండే వాళ్ళు షాక్ అయిపోయారు. జనరల్ గా ఏ స్టార్ సెలబ్రిటీ ఇలా చేయరు. ఫోటో అడిగితే విసిగిచ్చుకుంటూ ఉంటారు . కానీ విజయ్ సేతుపతి ఇలా చేయడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. విజయ్ సేతుపతి సింప్లిసిటీ పై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. నీలాంటి హీరోనే అందరికీ ఆదర్శంగా నిలవాలి అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇదేం ఆచారం ..అంటుంటే..పబ్లిసిటీ స్టంట్ అంటూ మీ పేరు మారుమ్రోగిపోవడానికి ఇలా చేస్తున్నావా ..? అంటూ వెటకారంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు..!!