రోహిత్ శర్మ మనసు డీప్ గా హర్ట్ చేసిన వెంకటేష్ హీరోయిన్..అంత మాట అనేసింది ఏంటి..?

ప్రెసెంట్ ఐపీఎల్ సీజన్ నడుస్తుంది ..ఎంత హాట్ హాట్ గా ముందుకు వెళ్తుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో మీమ్‌స్ .. ఈ ఐపిఎల్ కి సంబంధించి ఎక్కువగా చూస్తూనే ఉన్నాము. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది . ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టును వీడతాడని వచ్చే సీజన్ కి ముందు జరిగే మెగా వేలంలో అతను పాల్గొంటాడు అని తెగ తెగ ప్రచారాలు జరిగాయి . అది జరిగితే కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు కచ్చితంగా పోటాపోటీగా పోటీ పడతాయి అనడంలో సందేహమే లేదు అంటూ రోహిత్ శర్మ అభిమానులు ఓ రేంజ్ లో ఆయన్ను పొగిడేసారు.

కాగా ఇటీవల పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా మెగా వేలంలో రోహిత్ ను కొనుగోలు చేసేందుకు చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు ఆమె చెప్పినట్లు బాలీవుడ్ మీడియాలో ..సినిమా ఇండస్ట్రీలో క్రికెట్ రంగంలో వార్తలు జోరుగా ప్రచారం జరిగాయి. ” మా జట్టులో స్థిరత్వాన్ని తీసుకొచ్చే ఛాంపియన్ మైండ్ సెట్ ఉన్న కెప్టెన్ మిస్ అవుతున్నాం ..కాబట్టి ఒకవేళ రోహిత్ మా టీంలోకి వస్తే కొనుగోలు చేసేందుకు ఎంతకైనా వెళ్తాం అంటూ ప్రీతిజింతా మాట్లాడినట్టు ప్రచారం జరుగుతుంది”.

అయితే దీని పై ఆమె రియాక్ట్ అయ్యింది.” రోహిత్ శర్మ ని నేను గౌరవిస్తాను ..ఆయనకు బిగ్ ఫ్యాన్ ఒప్పుకుంటాను ..కానీ నేను అతనితో ఏ విషయం గురించి చర్చించలేదు . అసలు ఆయన పేరు నేను ఏ ఇంటర్వ్యూలో కూడా ఎత్తలేదు . మరి ఎలా ఇలా తప్పుడు వార్తలు రాస్తారు” అంటూ మండిపడింది . సోషల్ మీడియాలో ఎలా ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయో అసలు అర్థం కావడం లేదు “అంటూ అసహనం వ్యక్తం చేసింది. ” మా టీంలో గొప్ప గొప్ప ప్లేయర్స్ ఉన్నారు మాకు గొప్ప జట్టు ఉంది అంటూ ప్రీతిజింతా చెప్పుకు రావడం ఇప్పుడు రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు మండేలా చేస్తుంది”. నువ్వు ఇప్పుడు రోహిత్ శర్మను పొగిడావా..? తిట్టావా..? అంటూ మండిపడుతున్నారు . అంతేకాదు రోహిత్ శర్మ ఈ మాటలపై డీప్ గా హార్ట్ అయినట్లు కూడా ప్రచారం చేస్తున్నారు..!